అమెరికా పై విమర్శలు గుప్పించిన కెనడా ప్రధాని
ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి విజయం సాధించిన లిబరల్స్;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-29 12:06 GMT
కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించింది. గత దశాబ్ధకాలంగా ఇక్కడ ఆ పార్టీనే అధికారంలో ఉంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో లిబరల్ పార్టీ పంటపండినట్లు అయింది. అప్పటిదాక ప్రజల చేత చీత్కారానికి గురైన ఆ పార్టీ క్రమంగా పాపులారి సంపాదించుకుని మరోసారి అధికార పీఠంపై కూర్చుంది.
గత కొన్ని సంవత్సరాలుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కన్జర్వేటివ్ లకు మరోసారి తీవ్ర నిరాశ తప్పలేదు. ట్రంప్ వచ్చిరాగానే అప్పటి ప్రధాని జస్టిస్ ట్రూడోను తీవ్రంగా అవమానించారు.
అట్టవాను వెంటనే అమెరికాలో 51 వ రాష్ట్రంగా మారాలని వ్యాఖ్యానించారు. ట్రూడోను గవర్నర్ గా సంభోదించారు. ఇది కెనడియన్లకు తీవ్ర అవమానంగా మారింది.
ఇక్కడ జాతీయవాదం పెరగడానికి ట్రంప్ వ్యాఖ్యలే ఓ కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాగలిగింది.కెనడియన్లు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు ఈ ఎన్నికల సమయంలో అసలు చర్చకే రాకుండా పోయాయి.
కెనడా పార్లమెంట్ లో 343 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం లిబరల్స్ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంది. కన్జర్వేటివ్స్ మరోసారి ఎన్నికల ముందు చతికిల పడ్డారు. అయితే లిబరల్స్ కు కూడా పూర్తి మెజారిటి వస్తుందా? లేదా అని స్పష్టం కాలేదు. గతసారి లాగానే మరోసారి మిత్రపక్షాల సాయంతో కార్నీ అధికారంలోకి వస్తారని అంచనాలు ఉన్నాయి.
కార్నీ ఆవేశపూరిత ప్రసంగం..
ఈ ఎన్నికల్లో గెలవగానే ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ రాజధాని అట్టావాలో విజయ ప్రసంగం చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కెనడా సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఆయన ఆశ నెరవేరదన్నారు.
‘‘అమెరికా మన భూమిని, వనరులను, దేశాన్ని కోరుకుంటోంది’’ అని ఎన్నికల ప్రచారంలో చేసిన నిరంతర హెచ్చరికలను పునరావృతం చేశారు.
‘‘అమెరికా మనల్ని సొంతం చేసుకునేలా అధ్యక్షుడు ట్రంప్ మనల్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ గట్టిగా మాట్లాడారు.
‘‘అమెరికా తో మన ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. అమెరికా ద్రోహం చేసే షాక్ నుంచి మనం బయటపడ్డాము. ఇప్పుడు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని కార్నీ అన్నారు.
ఓటింగ్ పై ట్రంప్ ప్రభావం..
కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చాలనే సూచనలతో సహ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన దూకుడు ప్రకటనలు లిబరల్స్ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం.
ట్రంప్ ఆ దుందుడుకుతనం చాలామంది కెనడియన్లలో ఆగ్రహం దారితీయడానికి కారణంగా నిలిచింది. ఈ ప్రకటనతో చాలామంది అమెరికాలో తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు.
అమెరికన్ వస్తువులను కొనడానికి నిరాకరించారు. చాలామంది ముందస్తుగా అమెరికా చర్యలను వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఎన్నికల ముందు రోజు రికార్డు స్థాయిలో 7.3 మిలియన్ల కెనడియన్లు బ్యాలెట్ లో తమ తీర్పును నిక్షిప్తం చేశారు.
‘‘అమెరికన్లు మనల్ని సొంతం చేసుకోవడానికి మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ఎన్నికల ముందు రోజు కార్నీ అన్నారు. అవి కేవలం మాటల్లా కాకుండా తూటల్లా పనిచేశాయి.
ప్రతిపక్ష నాయకుడు పియరీ లావెల్ ట్రంప్ తరహ ప్రచారం నిర్వహించినప్పటికీ మరోసారి ప్రతిపక్షంలోకి ఉండకతప్పింది కాదు. ఆయన అమెరికాతో పొత్తు పెట్టుకున్నాడని ప్రత్యర్థులు చేసిన ప్రచారం చాలామంది కెనడియన్లకు నచ్చలేదు.
కఠినమైన మార్గం..
రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ కావాలని మార్క్ కార్నీ ధృవీకరించారు. అదే సమయంలో యూరోపియన్, ప్రపంచ భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకోవాడానికి ప్రయత్నిస్తున్నానన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ కెనడా ముందు అనేక సవాళ్లు ఉన్నాయని కార్నీ హెచ్చరించారు. పెద్ద మార్పు ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది. కానీ మన బలం మన ఐక్యతలో ఉందన్నారు. భవిష్యత్ అనిశ్చితులకు సిద్దం కావాలని పౌరులను కోరారు.
కెనడా ఒక దేశం కంటే ఎక్కువ కాబట్టి మేము సమాఖ్యగానే ఉన్నాము. మనం ఎల్లప్పుడూ పరిపూర్ణులం కాము. కానీ మనం మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాం, అవి సరైనవి మేము పనులు చేయడానికి ప్రయత్నిస్తాము, కానీ అవి సులభంగా కాదు’’ అని ఆయన అన్నారు.