క్యాన్సర్ బారిన పడిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన డొనాల్డ్ ట్రంప్;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-19 05:26 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు క్యాన్సర్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ప్రకటించింది. ‘‘అమెరికా మాజీ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది’’ అని ఆయన కార్యాలయం ఆదివారం స్వయంగా వెల్లడించింది.
మూత్ర విసర్జనలో కాస్త ఇబ్బంది పడ్డ బైడెన్ ను గతవారం వైద్యులు పరీక్షించి ప్రోస్టేట్ నాడ్యూల్ కనుగొన్నారు. శుక్రవారం వైద్యులు బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ కణాలు ఎముకకు వ్యాపించాయి.
‘‘వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. క్యాన్సర్స్ హార్మోన్ సెన్సిటివ్ గా కనిపిస్తుంది. ఇది సమర్థవంతమైన చికిత్సకు వీలు కల్పిస్తుంది’’ ఆయన కార్యాలయం తెలిపింది. బైడెన్ అతని కుటుంబం తన వైద్యులతో ఎలాంటి వైద్య చికిత్స చేయాలో సమీక్షిస్తున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.
క్యాన్సర్ దూకుడు..
ప్రొస్టేట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే పట్టుకుంటే చాలా వరకు వ్యక్తులు జీవించే అవకాశం ఉంది. పురుషులలో క్యాన్సర్ మరణాలకు ఇది రెండో కారణం. అమెరికన్ క్యాన్సర్ సోసైటీ ప్రకారం.. ఎనిమిది మంది పురుషులలో ఒకరు వారి జీవితకాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతలను ‘గ్లీసన్ స్కోర్’ అనే వాటితో కొలుస్తారు. దీనిలో 1 నుంచి 10 వరకూ అంకెలు ఉంటాయి. సాధారణ కణాలతో పోలిస్తే క్యాన్సర్ కణాలు ఎలా కనిపిస్తున్నాయో కొలుస్తుంది.
స్కోర్ లు 6 నుంచి 10 వరకూ ఉంటాయి. 8,9 10 ప్రొస్టేట్ క్యాన్సర్ లు కొంచెం ప్రమాదకరంగా భావిస్తారు. బిడెన్ ఈ స్కేలు లో 9 గా తేలింది. ఈ నివేదిక ప్రకారం ఆయనకు వ్యాధి తీవ్రత దూకుడుగా ఉందని అర్థం అయింది.
ఆయన ఎముకలకు కూడా క్యాన్సర్ సోకినట్లు నిర్థారణ అయింది. ప్రొస్టేట్ క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడూ అది మొదట ఎముకలకు సోకుతుంది. మెటాస్టాసైజ్డ్ క్యాన్సర్ కంటే చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మందులు అన్ని కణితులను చేరుకోవడం, వ్యాధిని పూర్తిగా తొలగించడం కష్టం.
ఆయన కోలుకోవాలి..రాజకీయా నాయకులు..
క్యాన్సర్ బారిన పడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు తిరిగి కోలుకోవాలని పలువురు రాజకీయా నాయకులు కోరారు. రాజకీయ ప్రత్యర్థి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వార్త తనకు బాధ కలిగించిందని అన్నారు. ‘‘జో త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము’’ అని ఆయన పోస్ట్ చేశారు.
మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోషల్ మీడియాలో మాట్లాడూతూ.. ఈ సమయంలో ఆయన కుటుంబానికి ధైర్యం కలగాలని దేవుడిని ప్రార్థించారు. ‘‘జో ఒక పోరాట యోధుడు, ఆయన జీవితాన్ని నడిపించిన అదే బలం, ఆశావాదంతో ఈ సవాల్ ను ఎదుర్కొంటారని నాకు తెలుసు’’ అని హారిస్ అన్నారు.
తగ్గుదల పరిధి..
82 ఏళ్ల బైడెన్ ఆరోగ్యంపై అమెరికాలో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది జూన్ లో రెండో సారి అధ్యక్షుడిగా మరోసారి పోటీ పడాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే ట్రంప్ తో జరిగిన మొదటి డిబెట్ లో బైడెన్ వెనకబడటంతో ఉపాధ్యక్షురాలు హారిస్ పోటీలోకి వచ్చారు. అయితే ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఆమె ఓడిపోయారు.
ఫిబ్రవరి 2023 లో బైడెన్ కు ఛాతీ నుంచి ఓ చర్మ గాయాన్ని తొలగించారు. అది బేసల్ సెల్ కార్సినోమా అంటే చర్మ క్యాన్సర్ సాధారణ రూపం. నవంబర్ 2021 లో ఆయన పెద్ద ప్రేగు నుంచి పాలిప్ తొలగించారు. ఇది క్యాన్సర్ కు ముందు ఉండే గాయం లాంటిది.
2022 లో బైడెన్ తన పరిపాలన ప్రాధాన్యతలలో ఒకటిగా క్యాన్సర్ మూన్ షాట్ ను ప్రారంభించారు. దీని లక్ష్యం రాబోయే 25 సంవత్సరాలలో అమెరికాలో క్యాన్సర్ మరణాల రేటు ను సగానికి తగ్గించడం, 2015 లో ఆయన పెద్ద కుమారుడు బ్యూ మెదడు క్యాన్సర్ తో మరణించాడు. ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన కృషికి ఇది జరగడంతో క్యాన్సర్ నివారణ కోసం పాలసీలు తీసుకొచ్చారు.
ప్రోస్టేట్ క్యాన్సర్..
ప్రోస్టేట్ పురుషులలో పునరుత్పత్తి వ్యవస్థలో ఓ భాగం. ఇది వీర్యం కోసం ద్రవాన్ని తయారు చేస్తుంది. ఇది మూత్రాశయం క్రింద ఉన్న పురుషాంగం ద్వారా మూత్రం, వీర్యం బయటకు వెళ్లే గొట్టం అయిన మూత్ర నాళం చుట్టు చుట్టుకుంటుంది.
ఇటీవల దశాబ్ధాలలో ఈ వ్యాధికి చేసే చికిత్స ఫలితాలు మెరుగుపడ్డాయి. రోగులు మెటాస్టాటిక్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో నాలుగు లేదా ఐదు సంవత్సరాలు జీవించవచ్చని మసాచుసెట్స్ జనరల్ బ్రిఘం క్యాన్సర్ సెంటర్ కు చెందిన డాక్టర్ మాథ్యూ స్మిత్ అన్నారు.
‘‘ఇది చికిత్స చేయదగినది, కానీ నయం చేయలేనిది’’ అన్నారు. శరీరంలోని హార్మోన్ల స్ఘాయిలను తగ్గించే లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలలో అవి రాకుండా ఆపే మందులతో ప్రోస్టేట్ క్యాన్సర్ కు చికిత్స చేయవచ్చు.
ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తాయి. ఈ పరిస్థితిలో చాలామంది పురుషులకు మందులతో చికిత్స అందిస్తారు. శస్త్రచికిత్స లేదా రేడియేషన్ థెరపీ చేయమని సలహ ఇవ్వమని స్మిత్ అన్నారు.