పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు, విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీలకు శుక్రవారం పాక్ సుప్రీంకోర్టు మిలియన్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

Translated by :  Chepyala Praveen
Update: 2023-12-22 12:58 GMT
ఇమ్రాన్ ఖాన్ పాక్ మాజీ ప్రధాని

జస్టిస్ సర్దార్ తారిక్ మసూద్, జస్టిస్ అథర్ మినాల్లా, జస్టిస్ మన్సూర్ అలీ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సైపర్ కేసులో పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తో పాటు మాజీవిదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి బెయిల్ మంజూరు చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు తన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రాలేడు. ముఖ్యంగా పదవిలో ఉండగా తోషాఖానా సంబంధించిన వస్తువులను తన స్వంతానికి వాడుకున్నాడని అభియోగాలతో తరువాత అరెస్ట్ అయ్యాడు. ఇదే కాకుండా మరో రూ.190 మిలియన్ల కేసుల్లో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

తనను ప్రధాని  పదవి నుంచి దింపడానికి అమెరికా కుట్ర చేసిందని, కొన్ని రహస్యపత్రాలను ఓ పబ్లిక్ మీటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రదర్శించారు. దీనినే సైఫర్ కేసుగా పేర్కొంటారు. డిసెంబర్ 13న అధికారిక రహస్యాల చట్టం కింద ఏర్పాటైన ప్రత్యే కోర్టు సైఫర్ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీలపై మరోసారి అభియోగాలు మోపింది.

న్యాయమూర్తి అబుల్ హస్నత్ అధికారిక రహస్యాల చట్టకింద రెండు పేజీల చార్జీషీట్ లను చదివి మూడు ఆరోపణలు వివరించారు. అనంతరం వారు నిబంధనలు ఉల్లఘించారని కోర్టు తీర్పు చెప్పింది. వాటిని తమ అవసరాల కోసం వినియోగించుకున్నారని తీర్పులో పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు వాటన్నింటిని పక్కన పెట్టి వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ వ్యాప్తంగా అనేక హింసాత్మక ఆందోళనలు జరిగాయి. పాక్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్మీ స్థావరాల పై సైతం దాడులు జరిగాయి. ఆందోళనలు అణచడానికి జరిపిన కాల్పుల్లో పదిమంది చనిపోయారు. అయినప్పటికీ తన అరెస్ట్ చట్ట విరుద్దమని, వెంటనే షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు జరపాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నాడు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.  ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ ఇప్పటికే  ఇస్లామాబాద్ చేరుకున్నాడు. నాలుగు సార్లు ప్రధానిగా పని చేసిన అనుభవం ఉన్న నవాజ్ ఐదోసారి సైతం పాక్ పగ్గాలు చేపడతారనే అంచనాలున్నాయి.

షరీఫ్  పీపీపీ తరఫున ఖైబర్ ఫక్తూన్ లోని తనకు పట్టున్న మాన్సెరా నియోజకవర్గం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ప్రత్యర్ధి వర్గానికి చెందిన ఇమ్రాన్ ఖాన్ ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. అవి పంజాబ్ లోని లాహోర్, రాజధాని ఇస్లామాబాద్, ఖైబర్ ఫక్తూన్ లోని మియావాలీ నుంచి పోటీ చేస్తున్నారని పీటీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే పాకిస్తాన్ రాజకీయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. మాజీ ప్రధాని షరీఫ్ పై ఎన్నికల్లో పోటీ చేయకుండా లైఫ్ టైమ్ బ్యాన్ ను ఆ దేశ సుప్రీం కోర్టు విధించింది. ఇమ్రాన్ ఖాన్ పై సైతం ఇదే నిషేధం విధించేలా ఉంది. అయితే ఇవన్నీ ఖాతరు చేయకుండా ఇద్దరు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. 

Tags:    

Similar News