మోదీ, రష్యా పర్యటనపై అమెరికా అసంతృప్తితో ఉందా?
ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అమెరికా ఆందోళనగా ఉందని తెలుస్తోంది. భారత్ లోని అమెరికా రాయబారీ ఎరిక్ గార్సెట్టీ వ్యాఖ్యలు, ఇదే సమయంలో అజిత్ దోభాల్ తో సులైవాన్..
By : The Federal
Update: 2024-07-13 12:00 GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన మాస్కో పర్యటనపై అమెరికాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడినందుకు రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నాలు అమెరికా జోరుగా చేస్తోంది. మోదీ పర్యటన సమయంలోనే అధ్యక్షుడు జో బిడెన్ వాషింగ్టన్‌లో నాటో 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం రష్యాను ఒంటరి చేయడమే.
పశ్చిమ దేశాలు కాకుండా మిగతా దేశాల్లో తనకు ఉన్న పలుకుబడి ఏంటో తెలపాలని పుతిన్ భావించారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో తన సంబంధాలు ధృడంగా ఉన్నాయని తెలపాలని ఆయన అనుకున్నారు.
ఉక్రెయిన్‌పై భారత్
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, యుఎస్ ఇతర పాశ్చాత్య దేశాలతో భారత్ బలమైన సంబంధాలను నెరుపుతూనే, తన సాంప్రదాయ వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యాను విడిచిపెట్టడానికి నిరాకరించడం ద్వారా తన దౌత్య విధానాన్ని బ్యాలెన్స్ గా మెయిన్ టెన్స్ చేస్తోంది. ఇప్పుడు అమెరికా, భారత్ విధానంపై ఒక సంశయాత్మక సందేహాన్ని బయటపెట్టింది.
భారత్ లోని అమెరికా రాయబారి, ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ఒక సంఘర్షణ సమయంలో "వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" కోసం ఎటువంటి స్పేస్ ఉండదని వ్యాఖ్యానించారు. ఇది అమెరికా భయాందోళనలను బయటపెట్టిందని చెప్పవచ్చు.
సులైవన్, దోవల్ చర్చ
యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులైవన్ జూలై 12 న తన భారత కౌంటర్ అజిత్ దోవల్‌తో ఫోన్ లో సంభాషించారు. బైడెన్ పరిపాలన యంత్రాంగం మోదీ రష్యా పర్యటనపై గుర్రుగా ఉన్నట్లు ప్రకటించారు. రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాలతో సహ ప్రపంచాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తుందని, దీనికోసం వాషింగ్టన్ లో జరుగుతున్న సమావేశం గురించి తెలుసుకోవాలని సూచించారు.
మోదీ, మాస్కో టైమింగ్
నాటో సమ్మిట్‌తో సమానంగా 2019 తర్వాత మోదీ రష్యా పర్యటనను ఎందుకు ప్లాన్ చేశారు? ఇదే ఏంటో వాషింగ్టన్ కు అర్థంకావట్లేదు. నాటో సదస్సుకు రెండు రోజుల ముందు జులై 8, 9 తేదీల్లో పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం మోదీ రష్యాలోనే ఉన్నారు. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకుంటున్న ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పుతిన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు, గుర్రపు స్వారీ చేసేవారి ప్రదర్శనకు మోదీ హాజరయ్యారు.
జెలెన్స్కీ భయం..
ఈ పర్యటన సమయంలోనే రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఇది నేరుగా ఆస్పత్రి భవనాలపై పడటంతో 44 మంది మరణించారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు ప్రపంచంలోని అత్యంత రక్తపాతంతో తడిసిన నేరస్థుడిని కౌగిలించుకోవడం శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ" అని వ్యాఖ్యానించారు. అయితే భారత్ కూడా తన వాదనను వినిపించింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను త్యాగం చేస్తుందని, ఉక్రెయిన్‌లో యుద్ధానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆశించడం అవాస్తవమని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలు
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 66 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచడంతోపాటు ఆర్కిటిక్, వ్లాడివోస్టాక్- చెన్నై మధ్య కొత్త షిప్పింగ్ మార్గాలను అనుసంధానించడంపై ఈ పర్యటనలో మోదీ -పుతిన్ చర్చించారు. వాణిజ్యం - ప్రయాణాన్ని మెరుగుపరచడానికి కజాన్, యెకాటెరిన్‌బర్గ్‌లలో రెండు కొత్త భారతీయ కాన్సులేట్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ, రష్యాను "అన్ని వాతావరణ కాలాల్లో" విశ్వసనీయ స్నేహితుడిగా అభివర్ణించారు. భారతదేశానికి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా మాత్రమే కాకుండా, రష్యా దాని అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. అణుశక్తి, అంతరిక్షం, ఉమ్మడి సైనిక ఉత్పత్తిపై కూడా రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి.
US అసంతృప్తి
మోదీ మాస్కో పర్యటన గురించి US పరిపాలనలో తీవ్రమైన నిరాశ ఉన్నప్పటికీ, నాటో సమ్మిట్ లో మాత్రం భారత్ ను విమర్శించలేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో చైనా, రష్యాకు సహాయపడుతుందని, నిర్ణయాత్మక ఎనేబుల్ అని వర్ణించింది. ఇంతకుముందు మోదీ జూన్ లో జరిగిన జీ7 మీటింగ్ సందర్భంగా ఇటలీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీను కలిసి మాట్లాడారు. ఇరువురు నేతలు కొనసాగుతున్న యుద్ధంపై చాలా విధాలుగా మాట్లాడారు. శాంతిచర్చలు మాత్రమే అత్యుత్తమంగా ఉంటాయని దానికి భారత్ ఎప్పుడు మద్ధతుగా ఉంటుందని న్యూఢిల్లీ వైఖరిని పునరుద్ఘాటించారు.
చైనా కారకం
అంతిమ విశ్లేషణలో చైనానే అమెరికా అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నందున రష్యాపై భారత్ ఇలా ఏర్పరచుకుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల, రష్యాతో తన సంబంధాలను కొనసాగించాలనే భారత్ నిర్ణయంపై నిరాశ, నిస్పృహ ఉన్నప్పటికీ అమెరికా మౌనంగా ఉంటోంది. చైనా దూకుడు వల్ల తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుందని, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో మరింత ఒత్తిడి తెస్తుందని, కాబట్టి భారత్ ను గట్టిగా మందలించే ప్రయత్నం అమెరికా చేయట్లేదు.
దోవల్ హామీలు
ఇరు దేశాల NSAల సంభాషణ "భాగస్వామ్య విలువలు, ఉమ్మడి భద్రత, వ్యూహాత్మక ఆసక్తుల" ఆధారంగా ఉందన్నారు. భారత్- యూఎస్ సంబంధాలను మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి రెండు వైపులా సన్నిహితంగా పనిచేయడానికి వీలు కల్పించిందని విదేశాంగశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.
శాంతి - భద్రతకు సంబంధించి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి, రెండు దేశాల సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి సమిష్టిగా పని చేయవలసిన అవసరాన్ని దోభాల్- సులైవాన్ అంగీకరించారు.
భారత్ ప్రకటన ప్రకారం, దోవల్ - సులైవన్ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ ఆందోళనకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. అలాగే క్వాడ్ ఫ్రేమ్‌వర్క్ క్రింద జూలై, ఆ తర్వాత సంవత్సరంలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశాల గురించి కూడా చర్చించారు.
రెసిస్టివ్ NATO
క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యులుగా ఉన్నారు. 2006లో ఈ సమూహం ప్రారంభమైనప్పటి నుంచి చైనాను లక్ష్యంగా చేసుకున్నట్లు బీజింగ్ అనుమానంతో చూసింది. తరువాత ప్రపంచం దృష్టి ఉక్రెయిన్ పై పడింది. రష్యా తన ఆత్మరక్షణ కోసం సైనిక చర్యకు దిగింది. దీంతో ఉక్రెయిన్ కు నాటో కూటమి ఎఫ్-16 వంటి యుద్ధ విమానాలతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని పంపించడం ప్రారంభించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతోంది. రష్యా నియంత్రణలో ఉన్న భూభాగాలను తిరిగి పట్టుసాధించలేమని అమెరికా గ్రహించింది.
క్షీణిస్తున్న US మద్దతు
USలో ఉక్రెయిన్‌కు ఇప్పటికే అమెరికన్ ప్రజలలో మద్దతు క్షీణిస్తోంది. US అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నందున రాబోయే నెలల్లో ఉక్రెయిన్ కు అందే సాయం తగ్గిపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే, నాటో ఉనికే ప్రశ్నార్థకం కావచ్చు.
ట్రంప్ ప్రాధాన్యత
రష్యాతో చర్చలు జరపడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడమే అమెరికా అధ్యక్షుడిగా తన ప్రాధాన్యత అని ట్రంప్ స్పష్టం చేశారు.
అతని వ్యూహాత్మక దృష్టి ఇండో-పసిఫిక్‌లో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇలా జరిగే యూరప్ దాని భవిష్యత్ గురించి మరింత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తోంది. కానీ రష్యాతో సంబంధాలను ఉపసంహరించుకోవడానికి భారత్ నిరాకరించినందున భారత్-అమెరికా సంబంధాలలో ఏర్పడిన ఒత్తిడిని తొలగిస్తామని న్యూఢిల్లీ హామీ ఇచ్చింది