కెనడా నుంచి హిందువులను బహిష్కరించాలని ఖలిస్తానీల ర్యాలీ

ఉగ్రవాద మద్దతుదారుల మూకల దుశ్చర్య, మోదీ, షా, జైశంకర్ దిష్టి బొమ్మలు బోనులో బంధించినట్లు ప్రదర్శన;

Translated by :  Chepyala Praveen
Update: 2025-05-05 10:08 GMT
బోనులో ఉన్న మోదీ, షా, జైశంకర్ దిష్టిబొమ్మలు

కెనడాలో నివసిస్తున్న దాదాపు మిలియన్ మంది హిందువులను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖలిస్తానీ తీవ్రవాదుల మద్దతుదారులు టోరంటో లో భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నాయకుల దిష్టిబొమ్మలతో కూడిన బొమ్మలను బోనులో బంధించినట్లు ఓ ట్రక్ లో సెటప్ చేసి, వాటిని ఊరేగిస్తూ తమ పైశాకత్వాన్ని చాటుకున్నారు.

కెనడాలోని మాల్టన్ గురుద్వారా వద్ద ఖలిస్తానీలు తమ జెండాలు ఊపుతూ నినాదాలు చేసి, తమ హిందూ వ్యతిరేకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాక్ జైలు ట్రక్ లో కేంద్ర హోంమంత్రి, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ దిష్టి బొమ్మలు కూడా కనిపించాయి.
హిందూ వ్యతిరేకత
‘‘ఇది భారత ప్రభుత్వ వ్యతిరేక నిరసనకాదు. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ నుంచి ఇది స్పష్టమైన హిందూ వ్యతిరేక ద్వేషం’’ అని హిందూ సమాజ నాయకుడు షాన్ బిండా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
1985 లో మాంట్రియల్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంపై జరిగిన బాంబుదాడిని ప్రస్తావించారు. ఈ విమానం ఐర్లాండ్ సమీపంలో సముద్రంపై పేలిపోయి అందులో ఉన్న 329 మంది మరణించారు.
కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్ మాన్ కూడా హిందూ వ్యతిరేక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మార్క్ కార్నీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. ఖలిస్తానీలపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వ్యవహరించిన దానికంటే భిన్నంగా ఉంటుందా లేదా అని ఆశ్చర్యపోయారు.
కార్నీకి సవాల్..
‘‘మనవీధుల్లో విధ్వంసం సృష్టించిన జిహాదీలు సామాజిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారు. వారు యూదులను బెదిరిస్తున్నారు. విద్వేషాన్ని సృష్టించడంతో ఖలిస్తానీలు ఉగ్రవాదులతో సమానంగా పోటీ ఇస్తున్నారు’’ అని బోర్డ్ మాన్ ట్వీట్ చేశారు.
ఈ ర్యాలీపై ఉత్తర అమెరికా హిందూ కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రపంచం ఇంతకుముందు వీరి హింసను చూసింది. మనమంత అప్రమత్తంగా ఉండాలి. నగర, ప్రాంతీయ జాతీయ సంస్థలు దీనిని గమనిస్తాయా? మానవ హక్కుల సంస్థలు, మీడియా దీనిని కవర్ చేస్తాయా’’? అని ట్వీట్ చేసింది.
బైసాఖీ కవాతు..
జాతీయ ఎన్నికల్లో మార్క్ కార్నీ నేతృత్వంలోని పార్టీ అద్బుతమైన విజయం సాధించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ హిందూ వ్యతిరేక ర్యాలీని ఖలిస్తానీ ఉగ్రవాద మద్దతుదారులు నిర్వహించారు.
గత నెలలో జరిగిన ఖల్సా డే బైశాఖీ పరేడ్ లో ఖలిస్తాన్ జెండాలు, భారత వ్యతిరేక విజువల్స్ కూడా కనిపించాయి. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఫొటోలపై వాంటేడ్ అని పోస్టర్ లు చూపించారు. ఇవి తీవ్ర విమర్శలకు గురైంది.
దేవాలయాల ధ్వంసం..
అధిక సంఖ్యలో సిక్కులు నివసించే కెనడాలో ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీ ఉన్న సిక్కు గురుద్వారా, హిందూ దేవాలయం విధ్వంసం జరిగిన సంఘటనలు జరిగిన తరువాత మరోసారి ఉగ్రవాద మద్దతుదారులు మరోసారి తమ హిందూ ఫోబియాను చాటుకున్నారు.
ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కావాలనే డిమాండ్ ను పాక్ ముందుకు తెచ్చింది. 1980 దశకంలో పంజాబ్ లో ఖలిస్తాన్ మూకలు విధ్వంసం సృష్టించాయి. అయితే అప్పటి ప్రభుత్వం కఠినచర్యలకు తీసుకోవడంతో కొన్నిశక్తులు పారిపోయి కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లో తలదాచుకున్నాయి. అక్కడ ఉన్న ప్రభుత్వాలు వీరి గురించి పట్టించుకోకపోవడంతో వీరు కొన్ని సంవత్సరాల నుంచి రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారు.
Tags:    

Similar News