ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే మధ్య చర్చలు..

రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు;

Update: 2025-04-05 10:43 GMT
Click the Play button to listen to article

భారత్(India), శ్రీలంక(Sri Lanka) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ(PM Modi), శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే (Anura Kumara Dissanayake) అంగీకరించారు. ఈ మేరకు ఇరుదేశాల నేతలు ఒప్పంద ఫైల్‌పై సంతకాలు చేశారు.

శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్‌ను సులభతరం చేయడానికి కూడా ప్రధాని సంతకం చేశారు. అనంతరం ఇద్దరు నేతలు సాంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు.

ప్రధానికి ఘన స్వాగతం..

బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) శిఖరాగ్ర సమావేశానికి హాజరైన మోదీ శుక్రవారం సాయంత్రం శ్రీలంక రాజధానికి చేరుకున్నారు. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను లంక ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది. శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు దిస్సనాయకే సంప్రదాయ పద్ధతుల్లో మోదీకి స్వాగతం పలికారు. 

Tags:    

Similar News