బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ముందు సవాల్లెన్నో..

నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఇక బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Update: 2024-08-09 10:27 GMT

నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఇక బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడతాయని, అధికార పరివర్తనలో మార్పులు చూస్తామని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.

పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కల్పించే విషయంలో ప్రస్తుతం నిరుద్యోగులకు, షేక్ హసీనా ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన వెంటనే ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను వీడి భారత్ చేరుకున్నారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా 84 ఏళ్ల యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొనసాగనున్నారు. ఈ పదవి ప్రధానమంత్రి పదవితో సమానం.

సలహా మండలిలో మరికొందరు..

ప్రభుత్వ సలహా మండలిలో యూనస్‌తో పాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అక్తర్, మితవాద పార్టీ హెఫాజాత్-ఎ-ఇస్లాం డిప్యూటీ చీఫ్ AFM ఖలీద్ హుస్సేన్, గ్రామీణ టెలికాం ట్రస్టీ నూర్జహాన్ బేగం, స్వాతంత్ర్య సమరయోధురాలు షర్మీన్ ముర్షిద్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్ సుప్రదీప్ చక్మా, ప్రొఫెసర్ బిధాన్ రంజన్. సలహా మండలి సభ్యులలో తౌహిద్ హుస్సేన్ ఉన్నారు.

శాంతి పునరుద్ధరణ తక్షణ కర్తవ్యం..

ఢాకా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎమెరిటస్ సెరాజుల్ ఇస్లాం చౌదరి మాట్లాడుతూ.. హసీనా పతనం తరువాత గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న అదుపుతప్పిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావడమే ప్రభుత్వ తక్షణ కర్తమని పేర్కొన్నారు. ప్రజల్లో కూడగట్టుకున్న భయాందోళలను ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడి జరిగేందుకు న్యాయమైన, ఆమోదయోగ్య పద్ధతిలో ఎన్నికలను నిర్వహించడం కూడా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని నొక్కి చెప్పారు.

ప్రముఖ న్యాయనిపుణుడు కమల్ హొస్సేన్ మాట్లాడుతూ.. ‘‘మార్పును అందరూ స్వాగతించారు. ఈవెంట్‌కు ప్రజలు భారీగా హాజరయ్యారు. మార్పు వచ్చినట్లు అందరూ భావిస్తున్నారు. సలహా మండలి సభ్యులు కొత్త సంక్షోభాలను పరిష్కారం చూపగలదని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

బారిస్టర్ సారా హొస్సేన్ ఇలా అన్నారు..‘‘మధ్యంతర ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. ఢాకా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ సమీనా లుత్ఫా మాట్లాడుతూ.."నేను తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నన్నా. అయితే ఇప్పుడు దేశాన్ని సంస్కరించగల నైపుణ్యం ఉందా? లేదా? అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభుత్వంలోకి వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం యొక్క నాయకులను కూడా చేర్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా.’’ అని చెప్పారు.

'సమయం పడుతుంది'

"మేము అసాధారణ పరిస్థితిలో ఉన్నాం. వాస్తవానికి ప్రతిదీ ఇప్పటికే పరిపూర్ణంగా ఉంటుందని మేము ఆశించలేము, దీనికి సమయం పడుతుంది. ఈ తరుణంలో, తాత్కాలిక ప్రభుత్వం చూడవలసిన మొదటి విషయం శాంతిభద్రతలను పునరుద్ధరించడం. ఆ తర్వాత ప్రజలకు భద్రత, న్యాయం, ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలి.   

Tags:    

Similar News