అమెరికాతో చివరిదాక పోరాడుతాం: చైనా

ట్రంప్ తాజా ప్రకటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజింగ్;

Update: 2025-04-08 10:23 GMT
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

వాణిజ్య యుద్దంపై చైనా- అమెరికా మధ్య వివాదం మరింత ముదురుతోంది. తమతో ఒప్పందానికి బీజింగ్ దిగి రాకపోతే అదనంగా మరో 50 సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై చైనా స్పందించింది. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి చివరి వరకూ పోరాడుతామని, అమెరికాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బెదిరింపు కాదు..
చైనాపై అమెరికా విధించిన పరస్పర సుంకాలు పూర్తినా నిరాధారమైనవి. ఇవి ఏకపక్ష బెదిరింపు అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా ప్రతీకార సుంకాలను విధించింది. తాజాగా మరికొన్ని శాతం సుంకాలను విధిస్తామని కూడా ఆ శాఖ ప్రకటించింది.
‘‘చైనా తీసుకున్న ప్రతిఘటన చర్యలు దాని సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ది ప్రయోజనాలను కాపాడుకోవడం, సాధారణ అంతర్జాతీయ వాణిజ్యక్రమాన్ని కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అవి పూర్తిగా చట్టబద్దమైనవి’’ అని చైనా మంత్రిత్వశాఖ తెలిపింది.
అమెరికా బెదిరింపు పొరపాటు: చైనా..
‘‘చైనా పై సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం ఒక పొరపాటు ఇప్పుడు మరో పొరపాటు హెచ్చరిక. ఇది అమెరికా బ్లాక్ మెయిల్ స్వభావాన్ని మరోసారి బయటపెట్టింది. చైనా ఇలాంటి వాటిని అంగీకరించదు. అమెరికా తనదైన రీతిలో పట్టుబడితే చైనా చివరి వరకూ పోరాడుతుంది’’ అని ఆ దేశ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
సోమవారం చైనాపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన బెదిరింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి సమతుల్యం చేయాలనే ఆయన ప్రయత్నం ఆర్థికంగా విధ్వంసక వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేస్తుందనే ఆందోళన రేకెత్తిచింది. సుంకాల యుద్దం మరింత తీవ్రమవుతుందున టోక్యో నుంచి న్యూయార్క్ వరకూ స్టాక్ మార్కెట్లు పతనం చెందాయి.
చైనానే ఎందుకు బెదిరించాడు..
గత వారం తాను ప్రకటించిన సుంకాలకు ప్రతీకారం తీర్చుకుంటామమని చైనా చెప్పిన తరువాత ట్రంప్ మరో ప్రకటన చేశాడు. ‘‘రేపు ఏప్రిల్ 8, 2025 నాటికి చైనా తన దీర్ఘకాలిక వాణిజ్య వినియోగం కంటే 34 శాతం అదనపు సుంకం ఉపసంహరించకపోతే, అమెరికా ఏప్రిల్ 9 నుంచి చైనా పై అదనంగా 50 శాతం అదనపు సుంకాలు విధిస్తుంది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో రాశారు.
దీనికి అదనంగా మాతో వారు అభ్యర్థించిన సమావేశాలకు సంబంధించి చైనాతో ఉన్న అన్ని చర్యలు రద్దు చేయబడతాయని ఆయన హెచ్చరించారు.
పెరిగిన సుంకాలు..
ట్రంప్.. చైనా ఉత్పత్తులపై కొత్త సుంకాలను అమలు చేస్తే, చైనా వస్తువులపై అమెరికా సుంకాలు మొత్తం 104 శాతానికి చేరుకుంటాయి. ఫెంటానిల్ అక్రమ రవాణాకు శిక్షగా ప్రకటించిన 20 శాతం సుంకాలు, గతవారం ఆయన ప్రకటించిన విడిగా 34 శాతం సుంకాలకు అదనంగా ఈ కొత్త పన్నులు ఉంటాయి.
ఇది అమెరికన్ వినియోగదారులకు ధరలు పెంచడమే కాకుండా, ఇతర దేశాలను చౌకైన వస్తువులతో నింపడానికి ఇతర వాణిజ్య భాగస్వాములతో, ముఖ్యంగా యూరోపియన్ తో లోతైన సంబంధాలను పెట్టుకునేలా చైనాకు ప్రొత్సాహం ఇచ్చే అవకాశం ఉంది.
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో స్టాక్ మార్కెట్ లాభాల గురించి గొప్పలు చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి.
కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా అమెరికన్లకు మంచి జరుగుతుందని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. చివరిలో మనమంతా ఒక అద్భుతాన్ని చూస్తామని అంటున్నారు.
షేక్ అవుతున్న మార్కెట్లు..
ట్రంప్ అధికారులు తన విధానాలు సమర్థించుకోవడానికి తరుచుగా టీవీల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపిస్తున్నారు. కానీ వారి వివరణలు పతనమవుతున్న స్టాక్ మార్కెట్లకు ఎలాంటి ఊతం ఇవ్వడం లేదు. చైనా మినహా అన్ని సుంకాలపై ట్రంప్ తాత్కాలికంగా విరామం ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారని ఓ నివేదిక బయటకు వచ్చింది. అయితే వైట్ హౌజ్ ఇది నకిలీ వార్తగా ప్రకటించింది.
అయితే అది నిజం కాదనే ముందు స్టాక్ ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా వినియోగ వస్తువులను అమెరికాకు సరఫరా చేసే ప్రధాన దేశం చైనానే. ఈ పన్నులు అంతిమంగా అమెరికా ప్రజలకు బదిలీ చేయబడతాయి.
ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మాట్లాడుతూ.. సుంకాల వల్ల ద్రవ్యోల్భణం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏదైన నిర్ణయాలు తీసుకునే ముందు ‘‘మేము కూడా చాలా వేచి ఉండాలి’’ అని అన్నారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ అమెరికాతో పాటు ఇతర దేశాలతో వాణిజ్యంపై దృష్టి సారిస్తుందని, ఇతర చోట్ల విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.
2024 లో చైనాతో పాటు అమెరికా మొత్తం వస్తువుల వ్యాపారం 582 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. దీని వలన అమెరికాతో వస్తువులలో అగ్రశ్రేణి వ్యాపారిగా నిలిచింది. 2024 లో చైనాతో వస్తువులు, సేవల వాణిజ్యంలో లోటు 263 బిలియన్ డాలర్ల నుంచి 295 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని పూరించడానికి ట్రంప్ టారిఫ్ వార్ కు తెరలేపారు. 
Tags:    

Similar News