తహవ్వూర్ రాణా అప్పగింత తరువాత ఏంటీ?
26/11 ఉగ్రవాద దాడుల్లో నిందితుల్లో ఒకరిని భారత్ కు అప్పగించడానికి అంగీకరించిన ట్రంప్;
By : The Federal
Update: 2025-02-14 10:40 GMT
అమెరికా అధ్యక్షుడితో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తరువాత 2008 ఉగ్రవాద దాడి నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా భారత్ ను అప్పగించడానికి తన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
‘‘2008 నాటి ముంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడు, ప్రపంచంలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన తహవ్వూర్ రాణాను భారత్ కు అప్పగించడానికి నా పరిపాలన విభాగం ఆమోదం తెలిపిందని చెప్పడానకి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను’’ అని ట్రంప్, మోదీతో సమావేశం తరువాత వైట్ హౌజ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
దీనిపై భారత్, అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది. ‘‘ముంబై ఉగ్రవాద దాడికి పాల్పడిన వ్యక్తిని భారత్ లో విచారణ కోసం అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసినందుకు అధ్యక్షుడు ట్రంప్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని భారత ప్రధాని అన్నారు.
విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నిర్థారిస్తుంది.
ఉగ్రవాది రాణాను భారత్ కు అప్పగిస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ధృవీకరించారు. ‘‘మిస్టర్ రాణా అమెరికాలోని అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకుంటున్నారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా అతని అప్పీల్ ను తోసిపుచ్చింది.
భారత అధికారులకు లొంగిపోవడానికి సంబంధించిన లాజిస్టిక్స్ పై పని చేయడానికి మేము ఇప్పుడు అమెరికా అధికారులతో సంప్రదిస్తున్నాం. ఈ ప్రత్యేక విషయం గురించి మేము మరింత విన్న వెంటనే మీకు తెలియజేస్తాము’’ అని మిస్త్రీ అన్నారు.
రాణాను త్వరగా దేశానికి అప్పగించడానికి సంబంధించిన విధానపరమైన అంశాలపై భారత అధికారులు, అమెరికా వైపు నుంచి పనిచేస్తున్నారని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
అమెరికాలో రాణాకు శిక్ష
లాస్ ఏంజెల్స్ లోని హై సెక్యూరిటీ జైలులో ఉన్న పాకిస్తాన్ సంతతికి చెందిన మాజీ వైద్యుడు కెనడియన్ వ్యాపారవేత్త అయిన రాణా, పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాల కారణంగా 2009 లో చికాగో లో అరెస్ట్ అయ్యాడు.
ముంబైలో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా సంస్థకు మద్దతు ఇచ్చినందుకు సంబంధించిన ఆరోపణలపై అతనిపై అమెరికా కోర్టులో విచారణ జరిగింది.
ఒక విదేశీ ఉగ్రవాద సంస్థకు భౌతిక సాయం అందించడం, డెన్మార్క్ లో ఉగ్రవాద దాడులు చేయడానికి కుట్ర పన్నినందుకు జ్యూరీ రాణాను దోషిగా నిర్థారించింది.
ముంబై దాడుల కేసులో నిర్థోషి
దేశంలో ఉగ్రవాద సంబంధిత దాడులకు భౌతిక మద్దతు అందించడానికి కుట్ర పన్నారనే ఆరోపణల నుంచి జ్యూరీ రాణాను నిర్థోషిగా ప్రకటించింది.
ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచించడాని మరో పాక్ సంతతి ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హ్యడ్లీకి సహకరించినట్లు అనుమానాలు ఉన్నాయి. ముంబైలో నిఘా నిర్వహించడానికి రాణా ఇమ్మిగ్రేషన్ వ్యాపారాన్ని ముసుగుగా ఉపయోగించుకునేలా చేయడంలో కీలకపాత్ర పోషించడానికి భారత అధికారులు వాదన.
అమెరికా కోర్టు తీర్పు..
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన ముంబై దాడిలో రాణా పాత్రకు సంబంధించి గత ఏడాది ఆగష్టులో అమెరికా కోర్టు అతన్ని భారతదేశానికి అప్పగించడానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాణాకు ఎదురుదెబ్బ తగినట్లు అయింది.
తరువాత ఏం జరగబోతోంది..
రాణా అప్పగింతకు అవసరమైన డాక్యుమెంటేషన్ ను పూర్తి చేయడానికి, అమెరికా అధికారులతో సమన్వయం చేసుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఒక బృందాన్ని అమెరికాకు పంపే అవకాశం కనిపిస్తోంది. ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారులు ఈ బృందంలో భాగమవుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రాణాను అప్పగించడానికి, అన్ని విధానపరమైన లాంఛనాలు సక్రమంగా జరుగుతున్నాయని నిర్ధారించుకోవడానికి ఎన్ఐఏ చాలా నెలలుగా కృషి చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రకటించడంతో ఉగ్రవాదిని అప్పగించడానికి మార్గం సుగమం అయింది.
దేశంలో విచారణ
రాణాను భారత్ కు అప్పగించిన తరువాత 2008 లో దేశ ఆర్థిక కేంద్రం పై జరిగిన దాడులపై విచారణ ఎదుర్కొంటారు. దాదాపుగా 10 మంది ఉగ్రవాదులు 60 గంటల పాటు దాడి చేసి 166 మందిని ప్రజలను హత్య చేశారు.
ఇందులో ఆరుగురు అమెరికన్ ప్రజలు సైతం ఉన్నారు. ఈ దాడులకు సంబంధించి ప్రతి ఒక్కరిని భారత న్యాయస్థానంలో జవాబుదారీగా ఉంచే ప్రయత్నం చేయడానికి భారత అధికారులు చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.