భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎందుకంత ముఖ్యం?

వచ్చే నెలలో బిమ్స్ టెక్ సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, ద్వైపాక్షిక సమావేశం కోరిన మహ్మద్ యూనస్;

Update: 2025-03-27 06:39 GMT
బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్

గత ఏడాది బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు తరువాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపారిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత దేశ పాలనను నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ చేతుల్లోకి వెళ్లాడు. అయితే ఇప్పటి వరకూ భారత్, బంగ్లాదేశ్ పాలకుడితో ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.

త్వరలో ఈ రెండు దేశాల పాలకులు నేరుగా ఎదురుపడే అవకాశం కనిపిస్తోంది. బ్యాంకాంక్ లో జరగనున్న బిమ్ స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానంగా సలహాదారు యూనస్ రాబోతున్నారు.
ఈ సమావేశానికి భారత్ ప్రధాని సైతం హజరవబోతున్నట్లు ఇప్పటికే న్యూఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బంగ్లా తాత్కాలిక పాలకుడు అయిన యూనస్, ప్రధాని మోదీతో భేటీ కావడానికి ఓ అభ్యర్థన చేశాడు. కానీ ఈ విషయంపై విదేశాంగ శాఖ నుంచి ‘అవును’ అని ‘కాదు’ అని సమాచారం పంపలేదు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో మరోసారి అస్థిరత వాతావరణం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థి నాయకులు, కరుడగట్టిన ఇస్లామిక్ వాదులను కట్టడి చేసే పనిని సైన్యం వేగంగా చేస్తోంది.
తనపై కుట్ర చేశాడని ఆరోపణలు వచ్చిన వెంటనే కీలక జనరల్ లను వెంటనే ఆయన పదవీ నుంచి తప్పించారు. ఈ పరిణామంతో యూనస్ ప్రభుత్వం బలహీనపడింది.
రెండు అంతర్జాతీయ ఆర్డిక కారిడార్..
భారత్ నుంచి తూర్పు దేశాలకు ఓ కారిడార్ ను నిర్మించాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది తూర్పు ఆసియాకు కనెక్టివిటీ పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడుతుంది.
ఈ కనెక్టివిటీ ప్రస్తుతం కల్లోలతంతో ఉన్న ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్లబోతోంది. బెంగాల్ లోని దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని హిలిని, మేఘాలయా లోని పశ్చిమ గారో హిల్స్ లో గల మహేంద్ర గంజ్ తో రోడ్డు రైలు మార్గాలు అనుసంధానం అయ్యాక బంగ్లాదేశ్ లోని ఎంటర్ కావాల్సి ఉంటుందని షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ వర్గాలు తెలిపాయి.
ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు పాయింట్ల మధ్య దూరం 445 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లకు తగ్గుతుంది. దీనికి రూ. 7 వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ కు భారత రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగా, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటేడ్ రోడ్ అలైన్ మెంట్ కు ప్రణాళిక సిద్దం చేసింది. ఈ ప్రాజెక్ట్ కు బంగ్లాదేశ్ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.
ఈ కారిడార్ కోల్ కత- మేఘాలయ మధ్య దూరాన్ని దాదాపు 500 కిలోమీటర్ల తగ్గుతుందని ఖర్చు, సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా అన్నారు.
రెండో కారిడార్..
రెండో కారిడార్ భూటాన్ ను పశ్చిమ గారో కొండలలోని పుల్భారీ ఘాట్ నదీ ఓడరేవుతో, తరువాత బంగ్లాదేశ్ లోని బంగాళాఖాతంతో అనుసంధానం అవుతుంది.
భూటాన్ లోని పైకాన్నుంచి మేఘాలయలోని దాలు మధ్య ఇప్పటికే రోడ్డు మార్గం పూర్తయింది. అయితే బంగ్లాదేశ్ ఈ మార్గానికి పచ్చజెండా ఊపితేనే ప్రాజెక్ట్ కు లాభం ఉంటుంది.
ఈ పనులను వేగవంతం చేయాలని మేఘాలయ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఈ రెండు ప్రాజెక్ట్ ల భవితవ్యం అనేది ఢాకా- న్యూఢిల్లీ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంపైనే ఆధారపడి ఉంటుంది.
దెబ్బతిన్న సంబంధాలు.. ప్రాజెక్ట్ లను దెబ్బతీస్తాయి..
బంగ్లాదేశ్ తో సంబంధాలు క్షీణించడం వల్ల ఈశాన్య ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లు ఇప్పటికే నిలిచిపోయాయి. వాటిలో ముఖ్యమైనవి.
దాదాపు రూ. వెయి కోట్ల విలువైన అఖౌరా- అగర్తల రైల్వే ప్రాజెక్ట్. త్రిపురలోని సబ్రూమ్ ను బంగ్లాదేశ్ లోని రామగఢ్ తో అనుసంధానించడానికి రూ. 133 కోట్ల వ్యయంతో ఫెని నదిపై స్నేహ వంతెన ముఖ్యమైనవి.
ఇది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైనది. బంగ్లాదేశ్ లోని మాతర్ బరి డీప్ సీ పోర్ట్ ద్వారా బంగాళాఖాతంలోని పారిశ్రామిక విలువ గొలుసులతో ఈశాన్యాన్ని అనుసంధానించే కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
ఈ ప్రాంతం విస్తృత ప్రయోజనాల కోసం భారత్- బంగ్లాదేశ్ తో సంబంధాలను తగ్గించుకోకూడదు’’ అని నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి కేఎల్ చిషి అభిప్రాయపడ్డారు.
మయన్మార్ కష్టాలు..
యాక్ట్ ఈస్ట్ పాలసీలో భారత్ కు తూర్పు వైపుగా ఉన్న దేశం మయన్మార్. అయితే ఇక్కడ ఐదు సంవత్సరాలుగా అంతర్యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తూర్పు ఆసియా దేశాలలో వాణిజ్యం కొనసాగించడానికి కేవలం సముద్ర మార్గం మాత్రమే దిక్కు.
ఏప్రిల్ 2 నుంచి 4 వరకూ జరిగే బిమ్స్ టెక్ శిఖరాగ్ర సమావేశంలో కొన్ని రోజుల ముందు మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ కాబోతున్నాడు. ఇది దేశాధినేతలతో యూనస్ జరిగే తొలి ద్వైపాక్షిక సమావేశం. ఇదే సమయంలో భారత్ తో సమావేశం కావడానికి బంగ్లాదేశ్ ప్రతిపాదన పంపింది.
‘‘ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వం దాని రెండు శక్తివంతమైన పొరుగు దేశాలతో సమతుల్యతను కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉందని సందేశం ఇస్తుంది’’ అని బంగ్లాదేశ్ పరిణామాలను జాగ్రత్తగా గమనించే రాజకీయ వ్యాఖ్యాత అమల్ సర్కార్ అన్నారు.
యూనస్- జిన్ పింగ్ సమావేశం..
బ్యాంకాంక్ సమావేశంపై నిర్ణయం తీసుకునే ముందు, మార్చి 25-28 తేదీలలో చైనా పర్యటన కు వెళ్తున్నారు. ఈ ఫలితాన్ని న్యూఢిల్లీ అంచనా వేయాలని అనుకుంటోంది. ఢాకా ప్రతిపాదన పరిశీలనలో ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పార్లమెంటరీ ప్యానెల్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న అస్థిర పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. పదవీచ్యుతీరాలైన షేక్ హసీనా ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థి విభాగం నేతలు ఆరోపిస్తూ, నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సైన్యం ఢాకా లో తన ఉనికిని విస్తరించుకుంటోంది.
ప్రస్తుతం అవామీ లీగ్ ను నిషేధించే ఉద్దేశం తనకు లేదని తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నేరాలకు పాల్పడిన వ్యక్తులు, నాయకులను బంగ్లాదేశ్ కోర్టులు విచారిస్తాయని చెబుతున్నారు.
Tags:    

Similar News