అమెరికా నుంచి ‘అదాని’కి ఉపశమనం లభించబోతుందా?
ఎఫ్సీపీఏ చట్టం అమలును నిలిపివేసిన ట్రంప్, అదానికి మద్దతుగా లేఖ రాసిన ఆరుగురు ఎంపీలు;
By : The Federal
Update: 2025-02-11 11:59 GMT
భారత్ లో సౌర విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ఉన్నత స్థాయి అధికారులకు లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న గౌతమ్ ఆదానికి ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానిపై జో బైడెన్ కాలంలో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.
అధికారంలోకి వచ్చిన ట్రంప్ బృందం అప్పట్లో అక్రమంగా కేసులు పెట్టారని భావిస్తున్న అందరికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆరుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ‘యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్’ తీసుకున్న ప్రశ్నార్థకమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా కొత్త నియామకం అయిన అటార్నీ జనరల్ కు లేఖ రాశారు.
ఇందులో అమెరికా సన్నిహిత దేశమైన భారత్ తో బంధాన్ని ప్రమాదం లో పడవేసే అదానీ గ్రూపు పై అభియోగ పత్రం కూడా ఉంది.
అయితే అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విదేశీ అధికారులకు అమెరికా వ్యాపారాలు లంచం ఇవ్వడాన్ని నేరంగా పరిగణించే సమాఖ్య చట్టం అమలును నిలిపివేస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. అదానీ పై కూడా విదేశీ అవినీతి పద్దతుల చట్టం(ఎఫ్సీపీఏ) కింద అభియోగాలు మోపారు.
కాంగ్రెస్ సభ్యులు రాసిన లేఖలో ఏముంది..
కాంగ్రెస్ సభ్యులు లాన్స్ గూడెన్, పాట్ ఫాలన్, మైక్ హరి డోపోలోస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్ టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ .. . బైడెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని ప్రశార్థకమైన నిర్ణయాలపై గుర్తిస్తూ.. అమెరికా అటార్నీ జనరల్ పమేలా బేండీకి లేఖ రాశారు.
భారత్ లో సౌర విద్యుత్ ఒప్పందాలకు అనుకూలమైన నిబంధనలకు పట్టించుకోకుండా 250 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆదానిపై అభియోగాలు మోపారు.
ఈ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూపు బిలియన్ల డాలర్లు సేకరించిన అమెరికన్ బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి ఈ విషయాన్ని దాచిపెట్టారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అమెరికన్ పెట్టుబడిదారులు లేదా మార్కెట్లతో కొన్ని సంబంధాలు ఉంటే విదేశీ అవినీతి ఆరోపణలను కొనసాగించడానికి యూఎస్ చట్టం అనుమతిస్తుంది. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలు ఖండించింది.
భారత్ తో భాగస్వామ్యం ప్రమాదంలో పడింది..
ఈ కేసులలో కొన్ని స్వదేశంలో,విదేశాలలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, భారత్ వంటి సన్నిహిత దేశాలతో సంబంధాలను ప్రమాదం లో పడేసేలా ఉన్నాయని కాంగ్రెస్ సభ్యులు తమ ఉమ్మడి లేఖలో పేర్కొన్నారు.
దేశం దశాబ్దాలుగా అమెరికాకు ముఖ్యమైన మిత్రదేశంగా ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ సంబంధం రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రాలకు అతీతంగా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య నిరంతర సామాజిక సాంస్కృతిక మార్పిడిగా పరిణామం చెందింది.
అయితే ఈ చారిత్రక భాగస్వామ్యం, స్నేహితుల మధ్య నిరంతర సంభాషణ, బైడెన్ పరిపాలన లో జరిగిన తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా ప్రమాదంలో పడిందని వారు లేఖలో ఆరోపించారు.
అలాంటి ఒక నిర్ణయమే భారత్ లో ఉన్నత స్థాయిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ లపై కేసులు నమోదు చేయడం, ఇందులో వారిపై లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసును ఇండియాకు అప్పగించడానికి బదులుగా, బైడెన్ ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు.
తప్పుదారి పట్టించే క్రూసేడ్..
ఏదైన కొన్ని స్పష్టమైన బయటి ఆధారాలు ఉంటే తప్పా, భారత దేశం వంటి మిత్రదేశంతో సంబంధాలను క్లిష్టతరం చేసే విధంగా కేసును కొనసాగించడానికి ఎటువంటి బలమైన కారణం లేదని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. అమెరికా ఆర్థిక శ్రేయస్సు కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ట్రంప్ నిర్ణయాలకు భారత్ వంటి దేశాల విలువైన భాగస్వామ్యం అవసరం అన్నారు.
అమెరికా ప్రయోజనాలకు..
పది బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి వేలాది ఉద్యోగాలను సృష్టించే వారిపై అనవసర చర్యలు తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడిదారులు దూరమై పోతారని లేఖలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే.. ఇలాంటి నిర్ణయాలు ఇంకా కొనసాగిస్తే అమెరికా ప్రయోజనాలకు మంచి కంటే ఎక్కువ హనిని కలుగ జేస్తాయని పేర్కొంది. ఇటువంటి నిర్లక్ష్యపు నిర్ణయాలను అమెరికా అధ్యక్షడు రెండోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
బైడెన్ ప్రవర్తనను దర్యాప్తు చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని, సత్యాన్ని వెలికి తీయడంలో సమన్వయంతో కూడిన ప్రయత్నం కోసం ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను మాతో పంచుకున్నందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నామని వారు లేఖ లో పేర్కొన్నారు.
జిమ్మీ కార్టర్ భావన: ట్రంప్
ట్రంప్ ఎఫ్సీపీఏ కార్యనిర్వాహాక ఉత్తర్వుపై సంతకం చేస్తూ.. ఈ చట్టం ప్రపంచ వేదికపై కంపెనీలను ప్రతికూల స్థితిలో ఉంచుతుందని అన్నారు. ఎఫ్సీపీ కింద తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని కొత్తగా నియమితులైన అటార్నీ జనరల్ పామ్ బోండిని ఆయన ఆదేశించారు.
ఆ దేశాలలో వ్యాపారం పొందె లక్ష్యంతో విదేశీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు డీఓజే ఆరోపించిన అమెరికన్ వ్యక్తులు, కంపెనీలపై ప్రాసిక్యూషన్లు కూడా ఉన్నాయి.
ఇది కాగితంపైనే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆచరణాత్మకంగా ఇది ఒక విపత్తని ట్రంప్ ఎఫ్సీపీఏ గురించి చెప్పారు. ఈ చట్టం వల్ల ఎవరూ అమెరికన్లతో వ్యాపారం చేయడానికి ఇష్టపడరని అన్నారు.
ఇవన్నీ జిమ్మి కార్టర్ భావన అని వినడానికి చాలా బాగుంటుందని, కానీ ఇది నిజానికి చాలా చెడ్డదని, అమెరికా ను బాధిస్తుందని ఎవరూ వ్యాపారం చేయడానికి ఇష్టపడనందున చాలా ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతున్నారని అన్నారు.
కొత్త మార్గదర్శకాలు..
ప్రస్తుతం, గతంలో ఎఫ్సీపీఏ కింద ఉన్న అన్ని చర్యలు సమీక్షించబడతాయని, భవిష్యత్ లో చేపట్టాల్సిన అన్ని ఎఫ్సీపీఏ దర్యాప్తులు, చర్యలు బోండి జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడతాయని ఆమె ఆమోదం అవసరమని వైట్ హౌజ్ ప్రకటించింది. ఎఫ్సీపీఏ చట్టం ద్వారా అమెరిక కంపెనీలు అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనకుండా అడ్డంకులు కలిగించిదని వైట్ హౌజ్ ఫ్యాక్ట్ షీట్ ఆరోపించింది.