పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు కూడా సభ మొదలైన కొద్దిసేపటికే స్పీకర్.. సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. పలు అంశాలపై ప్రతిపక్షాల నిరసన బాటపట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25శాతం సుంకాలు, పెనాల్టీ విధించడం, బీహార్‌లో తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వంటి అంశాలపై ప్రతిపక్షాలు నిరసన బాటపడుతున్నాయి. అదే విధంగా ‘భారత దేశ ఆర్థిక వ్యవస్థ చనిపోయింది’ అన్న ట్రంప్ స్టేట్మెంట్కు రాహుల్ గాంధీ ఆమోదం తెలపడంపై చర్చించాలని బీజేపీ పట్టుబడుతోంది. దాంతో పాటుగానే మలెగాన్ పేరలుడు కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం వంటి అంశాలను బీజేపీ చర్చకు తీసుకొస్తుంది. ట్రంప్ సుంకాలపై కేంద్ర గుస్సా.. భారత్‌పై ట్రంప్ విధించిన 25శాతం సుంకాల అంశంపై కేంద్రం స్పందించింది. కేంద్రమంత్రి పియూష్ గోషన్ ఈ వ్యవహారంపై పార్లమెంటో మాట్లాడారు. ‘‘ట్రంప్ విధించిన సుంకాల అంశాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. దేశ ప్రయోజనాలను సంరక్షించడం కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం కేంద్రం వాణిజ్య, పరిశ్రమల శాఖ.. పరిశ్రమలు, ఎగుమతిదారులు, భాగస్వాములతో వరుస భేటీలు అవుతోంది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తోంది. రైతులు, కార్మికులు, ఎంట్రపెన్యూర్స్, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ రంగంలోని భాగస్వాముల సంక్షేమానికి కేంద్ర పెద్దపీట వేస్తోంది’’ అని ఆయన తెలిపారు.