తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.