కవితకు వారం రోజుల ఇడి కస్టడీ (బ్రేకింగ్)

లిక్కర్ స్కామ్ కేసులో మలుపులు తిరుగుతున్న విచారణ

Update: 2024-03-16 11:53 GMT

డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవితకు వారం రోజుల ఇడి (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) రిమాండ్ విధిస్తూ కోర్టు  ఉత్తర్వులిచ్చింది.

ఈ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలను ఆమె ఎదుర్కొొంటున్నారు.   దీని మీద చాలా కాలంగా ఇడి విచారణ జరుపుతూ ఉంది. నిన్న సాయంకాలం ఆమెను ఇడి హైదరాబాద్ లో అరెస్టు చేసి  ఢిల్లీకి తరలించింది. ఈరోజు ఆమెను రౌజ్ ఎవెన్యూ కోర్టు హాజరుపరిచింది.

ఇంకా విచారించేందుకు ఆమెను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఇడి కోర్టును కోరింది.

అయితే, కోర్టు ఈ నెల 23 వ తేదీ దాకా ఇడి రిమాండ్ కు అంగీకరించింది.

అదే సమయంలోనే,  ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతి రోజు లాయర్లను కలిసేలా  కోర్టు  వీలు కల్పించింది.

ఆమె ఇంటి నుంచి ఆహారం తెప్పించుకోవచ్చు.   మళ్లీ  ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుచాలని కోర్టు ఈడీని ఆదేశించింది..



Tags:    

Similar News