కర్ణాటకలో కాంగ్రెస్‌కు 17 సీట్లు.. సర్వే అంచనా

కాంగ్రెస్‌కు ఇది శుభవార్త. ఈ సారి కర్ణాటకలో 17 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని ఈదిన (eedina.com) సర్వేలో తేలింది.

Update: 2024-03-21 13:18 GMT

2023లో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన ఒక స్వతంత్ర వెబ్ పోర్టల్..కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో 17 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి)-జనతాదళ్ (లౌకిక) కూటమి మిగిలిన 11 నియోజకవర్గాలను గెలుచుకుంటుందని పేర్కొంది.

గతంలో బీజేపీ క్లీన్‌స్వీప్..

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కాంగ్రెస్‌కు ఒక సీటు, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జాతీయ స్థాయిలో బలం పెరగడానికి కర్ణాటక చాలా దోహదపడిందనే చెప్పాలి.

ఈడినా పోర్టల్ ప్రకారం.. 2014లో మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా మంది ఓటర్లు పెరుగుతున్న ధరలు, ఉద్యోగావకాశాలు తగ్గడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంటింటి సర్వే..

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడానికి ముందు ఫిబ్రవరి 15 - మార్చి 5 మధ్య పోర్టల్ కర్ణాటకలో 52,678 మందిని డోర్ టు డోర్ సర్వే చేసింది. గతంలో కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని ఫలితాలకు మూడు వారాల ముందు అంచనా వేసింది. 77 శాతం మంది ఓటర్లు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై, 53 శాతం మంది మోడీ హయాంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అభిప్రాయపడ్డారు.

ఈడినా సర్వే సమన్వయకర్త డాక్టర్ వాసు హెచ్‌వి ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “ఇంటింటికీ వెళ్లి చేసిన సర్వే విషయాలను వీలైనంత త్వరలో ప్రచురిస్తానని చెప్పారు.

ఓటు భాగస్వామ్యం..

సర్వే ప్రకారం..కాంగ్రెస్ తన 2023 నాటి ఓట్‌షేర్‌ను నిలుపుకుంటుంది. 2019 లోక్‌సభ ఫలితాల కంటే ఓటరు వాటా కొద్దిగా పెరుగుతుంది. 1996 నుంచి క్రమంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తగ్గుముఖం పడుతుందని సర్వే తేల్చింది. మొత్తం ఓట్లలో కాంగ్రెస్‌కు 43.77 శాతం ఓట్లు రాగా, బీజేపీ-జేడీ(ఎస్) కూటమి వాటా శాతం 42.35.

అసంతృప్తిపరుస్తున్న అంశాలివే..

76.55 శాతం మంది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, 53.18 శాతం మంది యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అభిప్రాయపడ్డారు. అలాగే అవినీతి పెరుగుతోందని 46.75 శాతం మంది, ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతోందని 42.02 శాతం మంది అభిప్రాయపడ్డారు.

పథకాలపై సంతృప్తి..

కాంగ్రెస్ పార్టీ పథకాలపై 56.14 శాతం మంది కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. 59.28 శాతం మంది మహిళలు, ముఖ్యంగా లబ్ధిదారులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. 39.67 శాతం మంది ప్రతివాదులు కాంగ్రెస్ పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

డాక్టర్ వాసు ది ఫెడరల్‌తో మాట్లాడుతూ: “ఈ సర్వే అభ్యర్థుల ప్రకటనకు ముందే నిర్వహించామని గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ఎవరు, ప్రచార సమయంలో ఇచ్చే హామీలను బట్టి ఓటరు నాడి మారవచ్చు ’’. అనిపేర్కొన్నారు. 

Tags:    

Similar News