‘‘దక్షిణాది నుంచి బీజేపీకి 60 సీట్లు’’
దక్షిణ భారత దేశం నుంచి బీజేపీకి దాదాపు 60 సీట్లు వస్తాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.
దక్షిణ భారత దేశం నుంచి బీజేపీకి దాదాపు 60 సీట్లు వస్తాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్‌పై ఈయన పోటీ చేస్తున్నారు. కేరళ, తమిళనాడులో బిజెపి మెరుగైన పనితీరును కనబరిచిందని, దక్షిణ భారతదేశంలో 60 స్థానాలు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళలో తొమ్మిది స్థానాల్లో బీజేపీ గట్టిపోటీనిచ్చిందని చెప్పారు. తమిళనాడులో రాజకీయ పరిణామాల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోందన్నారు.
పచ్చి అబద్ధాలు, తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. కేంద్ర హోం మంత్రి వీడియోను మార్ఫింగ్ చేసి లాభం పొందాలని చూస్తున్న కాంగ్రెస్ కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.