ఆస్ట్రేలియా ట్రెకింగ్ లో తెలుగు వైద్యురాలి మృతి
తెలుగు యువతి, ఆస్ట్రేలియా డాక్టర్‌గా చేస్తున్న ఉజ్వల వేమూరు ఓ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణ వార్త కుంటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Update: 2024-03-09 04:21 GMT
ఎన్నో ఆశలతో జీవితంలో ఉన్నత స్థాయే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ వైద్యురాలు ఉజ్వల వేమూరును మరణం కబళించించింది. అనుకోని ప్రమాదంలా వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన విహారయాత్ర ఆమెకు అంతిమయాత్రలా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వైద్యురాలు కావాలని కన్న కల సాకారం చేసుకున్న ఉజ్వల.. పీజీ చేసి కెరీర్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ముందుకు సాగుతున్న ఆమె ఇంతలో ప్రమాదంలో ప్రాణాలుకోల్పోవడం తీవ్ర విషాదకరంగా మారింది.
అసలేం జరిగింది
ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ట్రైపాడ్ సహాయంతో ఫొటోలు తీస్తున్నారు. అప్పుడు ట్రైపాడ్ జారి కింద ఉన్న అంచున పడింది. దాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉజ్వల లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఉజ్వల ముందుగా 10 మీటర్ల లోతు ఉన్న లోయలో పడ్డారు. ఆ తర్వాత కింద ఉన్న మరో 10మీటర్ల లోతు నీటికుంటలో పడి మరణించారని ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్స్ సుమారు ఆరు గంటలు కస్టపడి ఉజ్వల మృతదేహాన్ని రిట్రీవ్ చేశాయని ఆస్ట్రేలియా మీడియా రాసింది.
అసలు ఎవరీ ఉజ్వల
ఉజ్వల వేమూరు పుట్టి పెగింది కృష్ణాజిల్లలోనే. తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లొని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే ఉన్న రాయల్ బ్రిస్బెన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించారు. ఈ వార్త విని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉజ్వల తల్లిదండ్రులు మైథిలి, వెంకటేశ్వర్లు కూడా ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు. కుమార్తే మరణవార్త వినడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్యంతక్రియల నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు.