కేజ్రీవాల్‌ను జైలులో ఏమైనా చేయొచ్చు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు జైలులో ముప్పు పొంచి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-04-19 07:27 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు వెనక కుట్ర దాగి ఉందని, ఆయనకు జైలులో ఏమైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగ్ ఆరోపణలపై బిజెపి నుండి ఎవరూ స్పందించలేదు.

కేజ్రీవాల్‌ అనారోగ్యం గురించి బీజేపీ నాయకులు ఎగతాళిగా మాట్లాడుతున్నారని, "తప్పుదోవ పట్టించే" వార్తలు మీడియాలో వస్తుండడం బాధాకరమన్నారు సంజయ్. ఖైదీల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టరాదని జైలు నిబంధన ఉన్నపుడు, కేజ్రీవాల్‌కు సంబంధించిన నకిలీ డైట్ చార్ట్‌ను ఈడీ గురువారం మీడియాలో ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నించారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన కేజ్రీవాల్‌కు ఇంట్లో వండిన ఆహారం, ఇన్సులిన్‌ను ఇచ్చేందుకు నిరాకరించడం ద్వారా చంపడానికి కుట్ర జరుగుతోందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌కు టైప్ 2 మధుమేహం ఉన్నా.. మెడికల్ బెయిల్ కోసం లేదా ఆసుపత్రికి తరలించడానికి ఆయన ప్రతిరోజూ మామిడిపండ్లు, అరటిపండ్లు స్వీట్లు తింటున్నారని ED కోర్టుకు తెలిపిన కొన్ని గంటలకే అతిషి ఈ వ్యాఖ్యలు చేశారు.  

Tags:    

Similar News