అయోధ్య రామమందిరం బీజేపీ సొంతం కాదు : కమల్ నాథ్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బుధవారం (ఫిబ్రవరి 28) తన నియోజకవర్గం చింద్వారాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

Update: 2024-02-29 08:28 GMT

కమల్ నాథ్ బీజేపీలో చేరతారన్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. బీజేపీలో చేరుతున్నారట కదా అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ‘‘మీరే అలాంటి ప్రచారం చేస్తున్నారు. అలా నేనెప్పుడైనా, ఎక్కడైనా చెప్పేనా? అలాంటి వార్తలను మీరు ఖండించాలి’’ అని కమల్ నాథ్ బదులిచ్చారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన కమల్ నాథ్ బుధవారం (ఫిబ్రవరి 28) తన నియోజకవర్గం చింద్వారాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడి ప్రజల ప్రేమను నమ్మకాన్ని పొందుతున్నానని చెబుతూ..

‘‘కమల్‌నాథ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటే అది మీ ఇష్టం.. ఆ ఛాయిస్ మీకే ఇస్తున్నానని అని అన్నారు.

కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు. ఈ స్థానం నుంచే తన కొడుకును మళ్లీ పోటీ చేయించాలనుకుంటున్నారు కమల్ నాథ్. ఆ విషయాన్ని ఆయన ఇప్పటికే ప్రకటించారు కూడా.

చింద్వారా స్థానం నుంచి పోటీ చేయడానికి బిజెపి చాలా దూకుడుగా ఉందని అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని అన్నారు. ‘‘భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మనం ఓటు వేయాలి. మీ అందరిపై నాకు నమ్మకం ఉందని’’పేర్కొన్నారు కమల్ నాథ్.

అయోధ్యలో రామమందిరం గురించి మాట్లాడుతూ.. ‘‘రామ మందిరం బీజేపీ సొంతం కాదు. అది నాతో సహా అందరికీ చెందుతుంది.గుడి ప్రజల సొమ్ముతో కట్టారు. వాళ్లు (బీజేపీ) అధికారంలో ఉన్నారు కాబట్టి ఆలయాన్ని నిర్మించారు. అంతే’’ అని అన్నారు.

"మేము మతవాదులం, సంస్కృతిని చెక్కుచెదరకుండా ఉంచుతామన్న కమల్ నాథ్..‘‘ నేను కూడా రాముడిని పూజిస్తా. చింద్వారాలో నా కున్న భూమిలో హనుమంతుడి కోసం పెద్ద ఆలయాన్ని నిర్మించానని’’ చెప్పారు.

Tags:    

Similar News