‘సీఏఏ’ అమలుపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు

సీఏఏ అమలు పై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో నిబంధనలు నోటిఫై చేశారని ఆరోపిస్తూ 237 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి..

Update: 2024-03-19 11:41 GMT
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

సీఏఏ అమలు పై ఎటువంటి స్టే ఇవ్వబోమని సుప్రీంకోర్టు ప్రకటించింది. చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన 237 పిటిషన్లపై స్పందించడానికి ప్రభుత్వానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పిటిషన్‌పై స్పందించేందుకు నాలుగు వారాల గడువు కోరారు. దీనికి కోర్టు తిరస్కరిస్తూ కేవలం మూడు వారాల లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

"మేము 237 పిటిషన్లకు సంబంధించిన మెరిట్‌లపై వివరణాత్మక అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇరవై మధ్యంతర దరఖాస్తులు ఇప్పటికే దాఖలు చేయబడ్డాయి వాస్తవానికి, మాకు నాలుగు వారాలు కావాలి," అని అతను కోర్టుకు చెప్పాడు.
అదే సమయంలో, ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలు పిటిషనర్లకు ఏప్రిల్ 8 లోపు చట్టం ప్రకారం ఎవరైనా పౌరసత్వం పొందినట్లయితే తిరిగి సుప్రీంకోర్టు రావడానికి అనుమతి ఇచ్చారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా సీఏఏ అమలు చేస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పిటిషనర్లలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్ తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మోయిత్రా ఉన్నారు. ఈ కేసును ఏప్రిల్ 9 కి కోర్టు వాయిదా వేసింది. ఇంతకుముందే సుప్రీంకోర్టుకు సీఏఏ అమలు నిలిపివేయాలని కోరుతూ చాలామంది వచ్చారు. అయితే అప్పటికీ సీఏఏ నిబంధలను ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో కోర్టు పిటిషన్లు స్వీకరించడానికి నిరాకరించింది.
2019 లో పార్లమెంట్ సీఏఏ బిల్లును ఆమోదించింది. తరువాత కొన్ని వర్గాలు దీనిపై ఆందోళన చేశాయి. దీనికి ఫండింగ్ కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చాయని పసిగట్టిన ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్దం చేసుకుంది.
పౌరసత్వ సవరణ చట్టం
సీఏఏ ప్రకారం అఖండ భారతంలోని భాగాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి మత హింసకు గురైన భారత దేశానికి శరణార్థులైన ముస్లింమేతరులందరికి దీని ద్వారా కేవలం ఐదు సంవత్సరాల లోపు పౌరసత్వం ఇస్తారు. అయితే వారంతా డిసెంబర్ 31, 2014 కంటే భారత దేశంలోకి అడుగుపెట్టిన వారు అయి ఉండాలి. దీనివల్ల ముస్లింలకు ఎలాంటి భయం అవసరం లేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ శరణార్దులు భారత పౌరసత్వం చట్టం ప్రకారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సిటిజన్ షిప్ ఇస్తామని ప్రకటించారు.


Tags:    

Similar News