చైనాలో మరో ‘సూర్యోదయం’

చడీ చప్పుడులేకుండా 70 యేళ్లు రీసెర్చ్ చేసిన కమ్యూనిస్టు దేశం;

Update: 2025-02-07 06:39 GMT
ఫోటో సోర్స్ : ఎక్స్

తయారీ, నిర్మాణ రంగంలో అనేక అద్బుతాలు సృష్టించిన చైనా.. తాజాగా భూమిపైనే కృత్రిమంగా సూర్యుడిని ప్రయోగశాలలో పున: సృష్టించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆధునాతన ‘‘సూపర్ కండక్టింగ్ టోకామాక్’’ గా పిలువబడే ‘‘ కృత్రిమ సూర్యుడు’’ ను ప్రయోగశాలలో తయారు చేసింది.

గత నెలలో నిర్వహించిన ప్రయోగంలో ‘‘కృత్రిమ సూర్యుడు’’ ని 1066 సెకన్ల పాటు స్థిరంగా సృష్టించింది. ఇది ఫ్యూజన్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ ను సాధించడానికి చేసిన ప్రయోగంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంతకుముందు శాస్త్రవేత్తలు 403 సెకన్ల పాటు ప్యూజన్ ను మండించిన రికార్డును తాజా ప్రయోగంతో తుడిచిపెట్టేశారు.


 


ప్రయోగశాలలో సూర్యుడు ఏంటీ?
సూర్యుడి నుంచి మనకు నిత్యం వెలుతురు ఉండాలంటే లోపల సంలీన ప్రక్రియను నిరంతరం జరుగుతూ ఉండాలి. రెండు హైడ్రోజన్ అణువులు, ఒక హీలియం అణువుగా మారి అత్యధిక మోతాదులో వేడిని ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇది మానవాళికి అపరిమితమైన స్వచ్చమైన శక్తిని అందిస్తుంది. చైనా తాజాగా చేసిన ప్రయోగంతో ఇక నుంచి ఆ శక్తికి కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసుకోవడానికి మొదటి అడుగు పడింది.


 

ఇది సౌర వ్యవస్థకు మించిన అన్వేషణను అందిస్తుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్) పరిశోధకులు తెలిపారు. దాదాపు 70 సంవత్సరాలుగా ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు కృషి చేశారని చైనా ప్రకటించింది.
ఈ సూర్యుడి వల్ల ఉపయోగం ఏంటీ?
సీఏఎస్ ప్రకారం.. న్యూక్లియర్ ఫ్యూజన్ పరికరం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. శక్తి అవసరాలను ప్రజలకు ఎలాంటి కాలుష్యం లేకుండా అందిస్తుంది.
ప్రయోగశాలలో తయారు చేసిన ఈ సూర్యుడు నిజమైన సూర్యుడిలానే పని చేస్తుంది. తీవ్రమైన వేడీ, పీడనాన్ని ఉపయోగించి రెండు తేలికపాటి అణువులను ఒకే అణువుగా కలుపుతారు.
అయితే 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చేరుకున్న తరువాత స్థిరమైన దీర్ఘకాలిక ఆపరేషన్ ను కొనసాగించడం, నియంత్రణ సాధించడం ద్వారా మాత్రమే అణు సంలీన పరికరం విజయవంతంగా విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు.

 

ఒక ప్యూజన్ పరికరం వేల సెకన్ల పాటు అధిక సామర్థ్యంతో స్థిరమైన ఆపరేషన్ ను సాధించాలి. ఇది భవిష్యత్ ప్యూజన్ ప్లాంట్ల నిరంతరం విద్యుత్ ఉత్పత్తికి కీలకంమని డైరెక్టర్ సాంగ్ యుంటావో అన్నారు. తాజా ప్రయోగం ప్యూజన్ రియాక్టర్ అభివృద్ది వైపు కీలకమైన అడుగు వేసినట్లు అయిందని ఆయన అన్నారు.
 ఫిజిక్స్ డైరెక్టర్ యుంటావో సాంగ్ మాట్లాడుతూ.. ప్లాస్మా స్వయం స్థిర ప్రసరణ ప్రారంభించడానికి ప్యూజన్ పరికరం వేల సెకన్లతో పాటు అధిక సామర్థ్యంతో స్థిరమైన పనితీరును సాధించాలని అన్నారు. భవిష్యత్ లో ఫ్యూజన్ ఫ్లాంట్ల నిరంతర విద్యుత్ ఉత్పత్తికి ఇది చాలా అవసరమని అన్నారు.
ఫలితాలు ఎలా ఉన్నాయి..
సూపర్ కండక్టింగ్ టోకామాక్( ఈఏఎస్టీ) ప్రయోగశాలను 2006 లో ప్రారంభించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇద్దరు ప్యూజన్ సంబంధిత, పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 2021 లో ఈఏఎస్టీ 1 లో ప్రయోగంలో 160 మిలియన్ డిగ్రీలు, 1056 సెకన్లతో విడివిడిగా ప్లాస్మా ఆపరేషన్ ను నిర్వహించారు. ప్రయోగాత్మక పునాదిని వేయడంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా చెబుతున్నారు. తాజాగా మరో 1066 సెకన్ల పాటు ప్లాస్మా ఆపరేషన్ ను నిర్వహించింది.
ఇంకా ఏ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి..
ప్రపంచంలోనే అతిపెద్ద టోకామాక్ ప్రయోగాలు నిర్వహించడానికి దాదాపుగా 33 దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇది సూర్యుడు, ఇతర నక్షత్రాల మాదిరిగానే పెద్ద ఎత్తున కార్బన్ రహిత శక్తిని సృష్టించడానికి ఉపయోగపడుతుంది. దీని కోసం అయస్కాంత సంలీనాన్ని పరికరం ఉపయోగపడుతుంది.


 


ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియాక్టర్ నేటీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంధన ప్రాజెక్ట్ లలో ఒకటని వెబ్ సైట్ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఫ్రాన్స్ లో నిర్మాణంలో ఉన్న ఇంటర్నేషనల్ థర్మో న్యూ క్లియర్ ఎక్స్ పెరిమెంటల్ ప్రపంచంలోనే అతిపెద్ద అయస్కాంత నిర్భంధ ప్లాస్మ భౌతిక శాస్త్ర ప్రయోగంగా మారనుంది. దీనికి చైనాతో సహ భారత్, యూరోపియన్ యూనియన్, జపాన్, కొరియా, రష్యా, యూఎస్ఏ మద్ధతు ఇస్తున్నాయి.
సీఏఎస్ తాజాగా చేసిన కృత్రిమ ప్రయోగపు డేటా చైనాతో పాటు అంతర్జాతీయంగా ఇతర రియాక్టర్ల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తోంది. మానవాళికి ఫ్యూజన్ శక్తిని ఆచరణాత్మక ఉపయోగంలోకి తీసుకురావాలని ఆశిస్తున్నామని డైరెక్టర్ సాంగ్ చెప్పారు.
Tags:    

Similar News