చైనా, పాక్, మయన్మార్ సరిహద్దుని నిశితంగా గమనిస్తున్నాం: ఆర్మీ చీఫ్
టిబెట్ బోర్డర్ లో మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని ప్రకటన;
భారత్ చుట్టుపక్కలా దేశాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ లో సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయని, అయితే కొన్ని ప్రాంతాలు ఇంకా సున్నితంగానే కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా చైనా - భారత్ సరిహద్దులో పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉందని ఆర్మీ చీఫ్ సోమవారం చెప్పారు.
ఆర్మీ డే సందర్భంగా ద్వివేదీ మాట్లాడుతూ..చైనా సరిహద్దులోని కొన్నిప్రాంతాల్లో ఇప్పుడే పెట్రోలింగ్ ప్రారంభిచామని పేర్కొన్నారు. అక్టోబర్ లో ఇరు పక్షాలు సైన్యాలు డిస్ ఎంగేజ్ మెంట్ అయిన తరువాత డెప్సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతం సున్నితంగా ఉన్నప్పటికీ, స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే సరిహద్దులో ఎలాంటి పరిస్థితిపై ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సరిహద్దులో మౌలిక సదుపాయాలు పెంచడంపై మా దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు.