ఇంతకీ తమిళ ‘దళపతి విజయ్’ కథ ఏమిటి?

రజనీకాంత్, కమల్ హాసన్ ఫెయిల్ అయిన చోట జండా ఎగరేయాలనుకుంటున్నాడేమిటి?

Update: 2025-09-28 07:01 GMT

నిన్న తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఒక రాజకీయ ర్యాలీ తొక్కిసలాట 31 మంది ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక సంఘటనతో తమిళ సూపర్ స్టార్ ‘దళపతి విజయ్’ జాతీయ వార్త అయ్యారు.

ర్యాలీ లో జరిగిన ఈ తొక్కిసలాట దేశాన్ని కుదిపి వేసింది. దక్షిణభారత దేశంలో అత్యంత ఖరీదైన సూపర్ స్టార్ అయన. ఆ గ్రాఫ్ అలా పెరుగుతూ ఉన్నపుడే  ‘ఇక సినిమాలు చాలు’ అని  రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ అని నిరూపించుకోవాలనుకున్నాడు. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam:TVK) అనే పార్టీ స్థాపించాడు. ఆ పార్టీ తరఫున కరూర్ లో నిన్న ర్యాలీ జరిగింది. జనం విపరీతంగా వచ్చారు. అదే తొక్కిసలాటకు కారణమయింది.

ఫిబ్రవరి 2, 2024న,  రాజకీయ పార్టీ టీవీకే ప్రకటించక ముందు, విజయ్ మూవీల్లో చాలా విజయవంతంగా దూసుకుపోతున్నారు.సినిమా తీస్తే చాలు సూపర్ హిట్టే. ఇలా కీర్తి తారాస్థాయిలో ఉన్నపుడు ఆయనరాజకీయాల్లోకి రావాలనుకున్నారు. రాజకీయారంభం కూడా సూపర్ హిట్టే. ఇక్కడ విశేషమేమిటంటే, విజయ్ కున్న ధైర్యం. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నా, వస్తున్నా అంటూ రాజకీయాల్ని చూసి భయపడిపోయి ఆ ప్రయత్నం మానుకున్నారు. ఇక మరొక తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా, సక్సెస్ కాలేకపోయారు. చివరకు డిఎంకెకి దగ్గిరయ్యారు. ఈ అనుభవాలు ఇంకా పచ్చిపచ్చిగానే  ఉన్నాయి. అయినా విజయ్ రొమ్ముధైర్యంతో ముందుకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి డిఎంకె (DMK) నిరంకుశ పాలనకు స్వస్తి పలుకుతానంటున్నాడు.

ఆయన ఖ్యాతికి కారణం సినిమా వెలుగు ఒక్కటే కాదు. సంఘసేవా కార్యక్రమాలు కూడ దీనికి తోడయ్యాయి. విజయ్ మక్కల్ ఈయకమ్ అనే సంస్థను ప్రారంభించి సంఘ  సేవ చేస్తూ వచ్చారు.

చాలా కాలం ఆయన ఇలయ దళపతి అనే పేరుతో ఖ్యాతి పొందారు. అయితే, 2017లో వచ్చిన చిత్రం మెర్సల్ (Mersal)తర్వాత ఆయన దళపతి అయ్యారు. ఈ చిత్రానికి అట్లీ దర్వకత్వం వ హించారు.

ఇంతకీ దళపతి విజయ్ ఎవరు?

ఆయన సినిమా కుటుంబం నుంచే వచ్చారు. జూన్ 22, 1974న జన్నించారు. అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎవర్ కాదు, సినీ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్. తల్లి పేరు. శోబా చంద్రశేఖర్, ఆమె నేపథ్య గాయని. అలా ఆయనది సినిమాలతో పెనవేసుకున్న కుటుంబమే.

తొలినాళ్ల నుంచి విజయ్ కి నటనపై ఆసక్తి ఉంది. అందుకే 10 సంవత్సరాల వయసులో 1984లో పిఎస్ వీరప్ప నిర్మించిన తమిళ చిత్రం ‘వెట్రి’ లో బాల నటుడిగా అరంగేట్రం చేశాడు.

కొన్నేళ్లుగా, అతను కుటుంబం (1984), వసంత రాగం (1986), సత్తం ఒరు విలాయాట్టు (1987), ఇతు ఎంగల్ నీతి (1988)లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. 1985లో విడుదలైన నాన్ సిగప్పు మనిథన్‌లో బాలనటుడిగా రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్నాడు.

ఎనిమిది సంవత్సరాల తరువాత 18 ఏళ్ల పుడు హీరోగా ప్రత్యక్షమయ్యాడు. 1992లో విడుదలైన ‘నాలయ్య తీర్పు’ చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఆయన సెంతూరపండి, రసిగన్, దేవా, కోయంబత్తూర్ మాప్పిళ్ళై చిత్రాలలో నటించారు, అవన్నీ సూపర్ హిట్టే.

ఇలా వరుసగా 9 హిట్స్ ఇవ్వడం అరుదుగా జరుగుతుంది. దీనితో దళపతి విజయ్ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన సినిమాలన్నీ రూ. 200 కోట్లకు పైగా సంపాదించాయి.

2003–2011 మధ్యకాలంలో విజయ్ తమిళ సినిమాల్లో మేటి నటుడయ్యాడు. 2003లో ఆయన నటించిన తిరుమలై చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇండియా బాక్సాఫీస్ వద్ద ఆరోజుల్లో రూ. 50 కోట్లు పైగా వసూలు చేసిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. మొదటి వారంలోనే అత్యధికంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో కూడా సినిమా రికార్డును బద్దలు కొట్టింది. 2013లో వచ్చిన తుపాకీ చిత్రం రు.130 కోట్లు వసూలు చేసింది.

ఇలారోజులు గడిచే కొద్ది విజయ్ స్టార్‌డమ్ విపరీతంగా పెరిగింది. అతని సినిమాలకు టిక్కెట్లు కొనడానికి అభిమానులు క్యూ కట్టేవారు. భారతదేశంలో ఒక సినిమాకు రూ. 200 కోట్లు పారితోషికం తీసుకున్న మొదటి నటుడు దళపతి విజయే.

2004లో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest of All Time) సినిమాలో దళపతి విజయ్ కు 200 కోట్ల రూపాయల పారితోషికం అందిందని చెబుతారు. దీనితో ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగా నిలిచారు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్, అల్లు అర్జున్, రజనీకాంత్, ఆమిర్ ఖాన్ వంటి వారిని ఆయన అధిగమించారు.

2007లో ఎంజిఆర్ మెడికల్ యూనివర్శిటీ ఆయన చేపట్టిన సామాజిక సేవకలకు, సినీరంగంలో సాధించిన ఘనవిజయవాలకు గుర్తింపుగా ‘గౌరవడాక్టొరేట్’ తో సత్కరించింది. 

కేరళలో కూడా సూపర్ స్టార్ గా మారిన ఏకైన  మలయాళీయేతర నటుడు విజయ్ ఒక్కడే.

ఇటీవల ఆయన మనసు రాజకీయాలవైపు మళ్లింది. 2023–24లో విజయ్ తన రాజకీయ ఆసక్తిని వెల్లడించారు. సినిమాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ దీనిని ‘దళపతి 69’ అని కూడా పిలుస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది (2026) పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. 

తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ వయసు ఎంతో తెలుసా, కేవలం 51 సంవత్సరాలే.


Tags:    

Similar News