ఆ గ్రామంలో ముస్లింలు ‘అజాన్’ చెప్పడం మర్చిపోయారా?
గ్రామం మొత్తం మీద నివసిస్తున్న ఏకైక ముస్లిం వ్యక్తి;
By : Yusha Rahman
Update: 2025-03-31 08:03 GMT
నలందలోని షరీఫ్ బ్లాక్ లో ఉన్న సర్భాహ్ది గ్రామంలో ఓ మసీదు ఉంది. అక్కడ నలభై అయిదు సంవత్సరాల జాహిద్ అన్సారీ ప్రతిరోజు క్రమంతప్పకుండా ఐదుసార్లు నమాజ్(అజాన్) చేస్తాడు.
కానీ మసీద్ కు ఎప్పుడూ నమాజ్ చేయడానికి ఎవరూ రారు. ఎందుకంటే అతను గ్రామంలో ఉన్న ఏకైక ముస్లిం. ఒంటరిగా గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. అందుకే ఒంటరిగా నమాజ్ చేస్తాడు.
ఒకప్పుడు ఈ గ్రామంలో ముస్లింలు మెజారిటీగా ఉండేవారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ముస్లింలు లేరు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈ గ్రామంలో దాదాపు 680 హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం జాహిద్ మాత్రమే మిగిలి ఉన్న ముస్లిం వ్యక్తి.
సర్భాధిలో పుట్టి పెరిగిన జాహిద్, తన బాల్యం అంతా ఇక్కడే గడిపాడు. తన తండ్రి ఈ మసీద్ లోనే ముజ్జిన్ గా పనిచేసేవాడు. ఈ మసీద్ 200 సంవత్సరాల క్రితం నిర్మించారు.
దానిని బాగోగులు చూస్తే తన జీవితం ఇక్కడే ఆయన ముగించాడు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా తన కమ్యూనిటికి చెందిన వారు గ్రామం వదిలి వెళ్లినా.. తను మాత్రం గ్రామం విడిచి పెట్టడానికి నిరాకరించాడు. జాహిద్ మసీద్ లోనే ఉంటాడు. గ్రామంలో ముస్లింలకు చెందిన అన్ని వదిలివేసిన ఆస్తులను రక్షిస్తూ ఉంటాడు.
జాహిద్ కు సొంత కుటుంబం లేదు. తన మత సమాజంలో ఎవరూ లేకపోవడంతో జాహిద్ ప్రతిరోజు అదే షెడ్యూల్ ను అనుసరిస్తాడు. అతను నిద్రలేచి, మసీద్ ను శుభ్రం చేసి, అజాన్ ఇస్తాడు.
తన జీవనాధారంలో కోసం ప్రతిరోజు రాత్రి అతను గ్రామ పాఠశాలలో నైట్ వాచ్ మెన్ గా పనిచేస్తాడు. ప్రతి శుక్రవారం, మతపరమైన పర్వదినాలలో సమీపంలోని గ్రామాలకు వెళ్తారు.
నలభై సంవత్సరాల క్రితం వరకూ గ్రామంలో ఎప్పుడూ మత హింస జరగలేదు. ముఖ్యంగా నజ్జో బాబో అనే ముస్లిం జమీందార్, అతని స్నేహితుడు భిఖారీ మెహ్తో ఉన్నంతకాలం ఎలాంటి గొడవలు ఉండేవి కావు.‘‘అన్ని మతాల ప్రజలు కలిసి పండుగలు జరుపుకునేవారు’’ అని జాహిద్ ది ఫెడరల్ తో అన్నారు.
అయితే 1981 లో బీహార్ లోని షరీఫ్ లో మత ఘర్షణలు చెలరేగాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ గొడవల్లో 45 మంది మరణించారు. 70 మంది గాయపడ్డారు. అల్లర్లు ముగిసిన తరువాత ప్రజలలో గాలిలో బలంగా వ్యాపించింది.
తరువాత చాలామంది ముస్లింలు పట్టణం నుంచి వెళ్లిపోయారు. కొంతమంది భయంతో, మరికొందరు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.
‘‘అల్లర్ల తరువాత ముస్లిం కుటుంబాలు గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయాయి’’ అని 60 ఏళ్ల వ్యక్తి సంతోష్ పాస్వాన్ అన్నారు. ప్రస్తుతం గ్రామంలో ముస్లింల సమాజ ఉనికిని తెలిపే అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
వాటిలో శ్మశానవాటికలు, మందిరం, ఇమామ్ బారా మొదలైనవి ఉన్నాయి. చాలా మంది ముస్లింలు తమ ఇళ్లను అమ్మేశారు. గ్రామంతో అన్ని సంబంధాలను తెంచుకున్నారని ఆయన చెప్పారు.
భార్య నుంచి విడిపోయిన జాహిద్, తన తోబుట్టువులు నగరాలు, పట్టణాలకు మారిపోయిన గ్రామాన్ని విడిచిపెట్టలేదు. కారణం తన తండ్రికి ఇచ్చిన వాగ్థానం. ‘‘తన చివరి శ్వాస వరకూ మసీద్ ను జాగ్రత్తగా చూసుకుంటానని నా తండ్రికి వాగ్థానం చేశాను. నేను దాన్ని నిలబెట్టుకుంటున్నాను’’ అని జాహిద్ మాట.
ముస్లిం సమాజం మొత్తం వెళ్లిపోయినా.. జాహిద్ ను తమతో కలుపుకోవడానికి మిగిలిన గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. పండగలు, పెళ్లిలో తనను ఆహ్వనిస్తుంటారు. అనారోగ్యం వలన వంట చేయకపోతే.. ప్రజలు ఆహారం అందించడంతో పాటు, అవసరమైన రక్షణ పొందెలా చూస్తారు.
‘‘జాహిద్ కు ఏదైనా అవసరమైనప్పుడూ మేము అండగా ఉంటాము. మసీద్ కు నీటి సరఫరా లేదు. అయితే మేమే అతనికి ఆ అవసరాలు తీరుస్తాము’’ అని సంతోష్ అన్నారు.
గతంలో జాహిద్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. అందువల్ల విద్యార్థులలో చాలామంది తనని గౌరవిస్తారు. సర్ లేదా మాస్టర్ సాహాబ్ గా పిలుస్తారని సంతోష్ చెప్పారు.
నీటి సరఫరా ఎందుకు లేదనే విషయంపై గ్రామ సర్పంచ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. తాము ఇంతకుముందు నీటి పంపు ఏర్పాటు చేయడానికి ఆఫర్ ఇచ్చామని.. కానీ తను(జాహిద్) నిరాకరించినట్లు చెప్పారు. నీటి వల్ల మసీద్ ప్రాంతం అంతా తడిగా మారుతుందని అభ్యంతరం చెప్పాడని గుర్తు చేశారు.
‘‘గ్రామంలో మిగిలిన ఉన్న ఏకైక ముస్లిం అందువల్ల ఎలాంటి వివక్ష జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటాము. అతను ముస్లిం ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటున్నందున, ఆస్తి వివాదాలు జరిగే సందర్భాలు ఉన్నాయి. ఈ ఆస్తులపై ఎటువంటి ఆక్రమణ జరగకుండా చూస్తాము’’ అని సర్పంచ్ పేర్కొన్నారు.
సర్భాహ్ధిలో ఇప్పటికీ ముస్లింల ఆధీనంలో దాదాపు 2200 ఎకరాల భూమి ఉంది. జాహిద్ ఆ ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ ఆస్తులను రక్షించినందుకు బీబీ సోఘ్రా వక్ఫ్ నుంచి నెలకు రూ. 3 వేలు వస్తాయి.
ఈ ఆస్తులను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్ని సార్లు కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు వాటిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. వాటిని నివారించడానికి పంచాయతీ కూడా తగిన చర్యలు తీసుకుంటుంది.
ప్రస్తుతం గ్రామంలో లభిస్తున్న మద్దతుతో జాహిద్ ఏకీభవిస్తున్నాడు. ‘‘కొంతమంది గ్రామస్తులు ఇమామ్ బారా, శ్మశాన వాటికను గోశాల, ధాన్యం నిల్వ కేంద్రాలుగా వాడుతున్నారు. ఈ ఆస్తులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.
వాటిని వాడటం వల్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కొంతమంది దానిని చుట్టూ గొడవలు లేవదీయడానికి ప్రయత్నించినప్పుడల్లా సర్పంచ్ నాకు మద్దతు ఇస్తున్నాడు. ’’ అని జాహిద్ వివరించాడు.
అశోక్ మెహ్తూ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘నాకు జాహిద్ తండ్రి మాత్రమే కాదు. అతని తాత కూడా తెలుసు. మేమంతా ఒక కుటుంబంలా జీవించాము. తన తండ్రితో కలిసి ముస్లిం మందిరాలను దర్శించాము.
జాహిద్ నా కొడుకులాంటి వాడు. తన భార్యను విడిచిపెట్టినందుకు తనను బాగా తిట్టాను. ’’ అని చెప్పారు.
కానీ కొంతమంది హిందువులు జాహిద్ ను ఎగతాళి చేస్తారు. ‘‘ హిందువులు పాలించడం వల్లే మీరు ఇక్కడ సురక్షితంగా ఉన్నారు. అయితే మీరు పాలకులుగా ఉంటే.. హిందువులు ఇంత సురక్షితంగా ఉంటారా?
బంగ్లాదేశ్ లో హిందువులను ముస్లిం మతోన్మాదులు ఏం చేస్తున్నారు. ’’ అని తనను ప్రశ్నిస్తుంటారని చెప్పారు. దేశంలో శాంతి బలహీనంగా ఉందని అతను ఒప్పుకున్నాడు.
నేను ఏదయిన పనిమీద బయటకు వెళ్లినప్పుడూ అజాన్ వినిపించదు కాబట్టి గ్రామస్తులు ఫోన్ చేసి బాగానే ఉన్నావా అని క్షేమ సమాచారాలను కనుక్కుంటూ ఉంటుంటారు. గ్రామస్తులు అజాన్ కు అలవాటు పడ్డారని చెబుతుంటారు.
‘‘మేము చిన్నప్పటి నుంచి అజాన్ శబ్ధానికి అలవాటు పడ్డాము. ఇప్పుడు అజాన్ వినిపించకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. జాహిద్ గ్రామాన్ని వదిలి వెళ్లడం మాకు ఇష్టం లేదు’’ అని అశోక్ అన్నారు. తాము గ్రామంలో ముస్లింలను మిస్ అవుతున్నామని ఈ ఇద్దరు అభిప్రాయపడ్డారు.
‘‘మేము మా ముస్లిం స్నేహితులను కోల్పోతున్నాము. ఇక్కడ నివసించిన సమయం కూడా కోల్పోతున్నాము. వృద్దాప్యంలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ముస్లిం సోదరులు తిరిగి వచ్చిన గ్రామంలో నివాసించాలని కోరుకుంటున్నాము’’ అని పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు.