‘మోదీని అపఖ్యాతి పాల్జేస్తే.. రూ.100 కోట్లు ఇస్తామన్నారు’

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల వేళ..బయటకు వచ్చిన ఎంపీ ప్రజ్వల్ అశ్లీల వీడియోలు పెద్ద రాజకీయ దుమారాన్నిలేపాయి. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-05-18 08:46 GMT
పేపర్ క్లిప్పింగులను చూపుతున్న దేవరాజేగౌడ
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల వేళ.. బయటకు వచ్చిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ అశ్లీల వీడియోలు పెద్ద రాజకీయ దుమారాన్నిలేపాయి. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. లెటెస్టుగా మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు ఇందతా జరిగిందని బీజేపీ నేత దేవరాజేగౌడ అంటున్నారు.
ప్రధాని మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని కర్ణాటక బీజేపీ నేత జి దేవరాజేగౌడ ఆరోపించారు. తాము చెప్పినట్లు చేస్తే రూ.100 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారని చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండిల్ కుంభకోణంలో ఆరు రోజుల క్రితం దేవరాజేగౌడను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
శివకుమార్ బండారం బయటపెడతా..
దేవరాజేగౌడను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకెళ్తుండగా ఆయన పోలీసు వాహనం లోపల నుంచే పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు నాతో డీల్ కుదుర్చుకోవాలని చూశారు. శివకుమార్ నాకు అడ్వాన్స్‌గా రూ.5 కోట్లు పంపారు. అయితే నేను శివకుమార్ ఆఫర్‌ను తిరస్కరించా. దాంతో నాపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. నేను విడుదలైన తర్వాత అతని (శివకుమార్) బండారం బయటపెడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది" అని చెప్పారు దేవరాజేగౌడ.
ఇదంతా డిప్యూటీ సీఎం ప్లానే..
ప్రజ్వల్ అశ్లీల వీడియోలు బయటకు రావడం వెనక డీకే శివకుమార్ హస్తం ఉందని దేవరాజేగౌడ ఆరోపిస్తున్నారు. ‘‘ప్రజ్వల్ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన కార్తీక్ గౌడ నుంచి పెన్ డ్రైవ్‌ తీసుకుని, మొత్తం ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది శివకుమారే. అయితే పెన్‌డ్రైవ్‌ను సర్క్యులేట్ చేసింది కుమారస్వామే అని నన్ను స్టేట్ మెంట్ ఇవ్వమన్నారు. శివకుమార్ సంభాషణల ఆడియో రికార్డింగ్‌లు నా దగ్గర ఉన్నాయి. నేను వాటిని బయట పెడతా. జైలు నుండి బయటకు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ”అని దేవరాజేగౌడ చెప్పారు.
కుమారస్వామే మొదటి టార్గెట్..
"రేవణ్ణ సెక్స్ స్కాండల్‌ వ్యవహారంతో మోదీని ఇరుకున పెట్టడం. కుమారస్వామిని రాజకీయంగా అంతం చేయడమే శివకుమార్ ప్రధాన లక్ష్యం. వాళ్ల ప్లాన్‌కు నేను ఒప్పుకోలేదు. దాంతో వాళ్లు నన్ను లైంగిక వేధింపుల కేసులో ఇరికించారు. ఈ పన్నాగం కూడా విఫలం కావడంతో నాపై అత్యాచారం కేసు పెట్టారు.’’ అని దేవరాజేగౌడ చెప్పారు.
బీజేపీకి చెడ్డపేరు ఆపాదించాలని..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సహా నలుగురు మంత్రులు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. మోదీకి, కుమారస్వామికి, బీజేపీకి చెడ్డపేరు తెచ్చేలా పెద్దఎత్తున ప్లాన్‌ చేశారు. నాకు రూ. 100 కోట్లు ఆఫర్ చేసి రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా పంపించారు.
బీజేపీ, జేడీ(ఎస్)లు మిత్రపక్షాలు కావడంతో సెక్స్ కుంభకోణంపై పెద్దఎత్తున దుమారం రేగడంతో కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు తీవ్రంగా దెబ్బతింటుందని బీజేపీ వర్గాలు అంగీకరించాయి.
ఎన్నికల వేళ దుమారం రేపిన సెక్స్ వీడియోలు..
కర్ణాటకలో రెండో విడత లోక్‌సభ ఎన్నికల వేళ.. హసన్ నియోజకవర్గ జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు.ప్రజ్వల్ చిన్నాన్న హెచ్‌డి కుమారస్వామి, జెడి(ఎస్) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కూడా. ప్రస్తుత లోక్ సభ ఎన్నికలలో జెడి(ఎస్) భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News