సీఎఎను తమిళనాడులో అమలు చేయొద్దు: సీఎం స్టాలిన్‌కు విజయ్ లేఖ

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేసిన తర్వాత తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత తలపతి విజయ్ సోమవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు.

Update: 2024-03-12 04:59 GMT

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 ను తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత తలపతి విజయ్ తప్పుబట్టారు. ఈ చట్టాన్ని తమిళనాడులో అమలు చేయవద్దని ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆయన కోరారు.

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేసిన తర్వాత తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత తలపతి విజయ్ సోమవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని పొందేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు కేంద్రం భారతీయ జాతీయతను మంజూరుచేస్తుందన్నమాట.

అయితే పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే దేశంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA)ను అమలు చేయరాదని విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకుండా చూసుకోవాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని అని ప్రకటనలో కోరారు.

పార్టీ పెట్టిన తర్వాత విజయ్‌ది ఇదే తొలి రాజకీయ అభిప్రాయం. ఫిబ్రవరి 2న రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ తన పార్టీ పేరు (తమిళగ వెట్రి కజం)ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సోమవారం మాట్లాడుతూ.. రాజకీయ మైలేజీని పొందే ప్రయత్నంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు సిఎఎ నిబంధనలను నోటిఫై చేయడం.. ప్రధాని మోదీ మునిగిపోతున్న తన నౌకను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు.

మతం, జాతి ఆధారంగా వివక్ష చూపడానికి పౌరసత్వ చట్టాన్ని తెచ్చారని ఎంకె స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో బిజెపిని విమర్శిస్తూ పోస్టు చేశారు. ఇది ముస్లింలు, శ్రీలంక తమిళులకు ద్రోహం చేసిలా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019ని అమల్లోకి తీసుకువచ్చింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం 2019 పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. పూర్తి నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో చాలా కాలంగా ఈ చట్టం అమల్లోకి రాలేదు. ఈ పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత అమల్లోకి తెస్తారేమోనని భావించినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం తక్షణమే అమల్లోకి తెచ్చారు. సీఏఏ చట్టం అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌ జారీ అయింది.

ఈ చట్టం అమల్లోకి వస్తే..

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి ఇండియాకి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో మతం ఆధారంగా మొదటిసారి భారత పౌరసత్వ దక్కనుంది.

Tags:    

Similar News