లిక్కర్ పై తెలంగాణ వైఖరి మద్యం పరిశ్రమను దెబ్బతీసిందా?
యునైటెడ్ బ్రూవరీస్ తాజా ప్రకటనకు కారణం అదేనంట..;
By : The Federal
Update: 2025-01-11 13:44 GMT
కే. గిరి ప్రకాశ్
హీనెకిన్ ఆధ్వర్యంలోని యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణలో మద్యం సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇది రాష్ట్ర ఆల్కహాల్ మార్కెట్ కే కాకుండా దేశంలోని గొలుసుకట్టు పరిశ్రమలకు తీవ్ర ఆందోళన కలిగించే చర్య. తెలంగాణలో తలసరి ఆల్కహాల్ వినియోగం దేశ సగటునే మించిపోయింది. అందులో ప్రధాన పాత్ర ఈ కంపెనీదే. అయితే కొన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో మద్యాన్ని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
భారీ ఆదాయం ఇక్కడి నుంచే ..
దేశంలో మద్యం వినియోగం లో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం లెక్కలు తీసుకుంటే మద్యం సగటు తలసరి వ్యయం రూ. 1623 గా ఉంది. తెలంగాణ వచ్చిన ఏడాది ఈ వ్యయం రూ. 745 గా ఉండేది. దశాబ్ధకాలంగా ఈ వ్యయం దాదాపుగా రెట్టింపు అయింది. ఈ పెరుగదల ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల వంటి రాష్ట్రాలను మించిపోయింది. ఆల్కహాల్ వినియోగాన్ని సాంస్కృతికంగా అంగీకరించడం ఇక్కడ మంచి మార్కెట్ ఓపెన్ అయింది.
2022-23 లో తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారా సుమారు రూ. 34,145 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఆదాయం రూ. 45 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఈ గణాంకాలు మద్యం ఆదాయం పై ప్రభుత్వం ఎంతలా ఆధారపడిందో చూస్తే తెలుస్తోంది.
అయినప్పటికీ మద్యం సరఫరాదారులకు వారి వాటాను చెల్లించడానికి ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఈ కంపెనీ ఆ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. దానితో మార్కెట్ ను, దాని వినియోగదారులను ప్రమాదకర స్థితిలో ఉంచింది.
తమకు రూ. 4 వేల కోట్ల దాకా బకాయిలు రావాల్సి ఉందని, అలాగే మద్యం ధరల పెంపు 2019 నుంచి పెండింగ్ లో ఉందని యునైటెడ్ బ్రూవరీస్ వాదన. ఈ కంపెనీనే తెలంగాణలో దాదాపుగా 70 శాతం బీర్ మార్కెట్ ను నియంత్రిస్తోంది. ఈ కంపెనీ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కంపెనీల స్టాక్ లో 7 శాతం తగ్గుదలకు దారి తీసింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు ఆందోళనలను హైలైట్ చేసింది.
అనిశ్చిత ఆర్థిక పరిస్థితి..
ఆర్థిక ఒడిదుడుకులు మొత్తం ఇండస్ట్రీని అల్లకల్లోలం చేస్తున్నాయని విశ్లేషకుల మాట. చెల్లింపులు సకాలంలో అందకపోవడం, రోజువారీ పెట్టుబడులు, ధరల పెంపు లేకపోవడం, కంపెనీల నుంచి ప్రభుత్వం ముందస్తుగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకాలు వెరసి కంపెనీ తాజాగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
దేశంలో అతిపెద్ద బీర్ల వినియోగదారుడి ఉన్న తెలంగాణలో వీటి సరఫరా ఆగిపోవడం మంచి పరిణామం కాదు. గత ఏడాది డిసెంబర్ 28 నుంచి 31 మధ్య తెలంగాణ వ్యాప్తంగా రూ. 926 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు రోజువారిగా రూ. 70 నుంచి 100 కోట్ల వరకూ ఉంటాయి.
ప్రస్తుతం కంపెనీ నిర్ణయం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడి డిమాండ్ వల్ల మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మద్యం వినియోగదారులను గరిష్టంగా ప్రభావితం చేస్తుంది. పక్కరాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేయడానికి దారి తీయడంతో పాటు అసురక్షిత మద్యం వినియోగానికి మద్యం ప్రియులను ప్రేరేపిస్తుంది.
రెండు వైపులా పదును..
ఆదాయం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ పైనే అధికంగా ఆధారపడటం రెండు వైపులా పదును తేలిన కత్తిలాంటిది. ఇది రాష్ట్ర బడ్జెట్ కు గణనీయంగా దోహదపడటంతో పాటు, చెల్లింపుల ఆలస్యం కారణంగా రాబడి అంచనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దాని ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం.. తెలంగాణ మద్యం అమ్మకాలపై ఇప్పటికే ఎన్నికల నియంత్రణలు ప్రభావం చూపాయి. ఈ ప్రభావం రాష్ట్ర ఆదాయం చూపింది. ముఖ్యంగా తెలంగాణలో మూడు షిప్టులకు సంబంధించి యూబీబీఎల్ ఆమోదించారు. ఎన్నికల వల్ల సంవత్సరానికి దాని పెరుగుదల కేవలం 5 శాతానికే పరిమితం అయింది. లేదంటే వాల్యూమ్ పెరుగదల 9 శాతం వరకూ ఉండేదని అంచనాలు ఉన్నాయి.
ప్రభుత్వం చెల్లింపుల విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో భవిష్యత్ లో ఇతర కంపెనీల పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర ప్రైవేట్ మద్యం వ్యాపారుల విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం ఒక్కతెలంగాణకే కాదు, దేశ ఆల్కహాల్ మార్కెట్ పై ప్రభావం చూపుతుంది. ఇక్కడ సంవత్సరానికి రూ. 45 బిలియన్ల మార్కెట్ జరగుతోంది. అవన్నీ దెబ్బతిని వాటి అభివృద్ది ఆగిపోతుంది.
అధిక ప్రతిపాదన
గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆల్కహాల్ మార్కెట్ అధిక రిస్క్ ఉన్న గమ్యస్థానంగా మారుతుంది. కఠిన నియంత్రణ, అడ్డంకులు, ఆర్థిక అస్థిరత ఈ సంస్థలను వారి వ్యూహాలను తిరిగి పున: సమీక్షించుకోవడానికి దారి తీయవచ్చు.
అయతే ప్రస్తుత సంక్షోభం సంస్కరణలకు అవకాశాన్ని అందిస్తుంది. చెల్లింపు ప్రక్రియలను క్రమబద్దీకరించాలని, ఆధునాతన ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించాలని పరిశ్రమల సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ చర్యలు తెలంగాణలో పరిశ్రమను పునరుద్దరించగలవు. వాటాదారులో విశ్వసాన్ని నింపుతాయి.
తెలంగాణకు సరఫరాలను పున: ప్రారంభించడానికి మద్యం మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం తన స్థానాన్ని కాపాడుకోవడానికి చెల్లింపు వివాదాలను వేగంగా పరిష్కరించుకోవడం అవసరం. ఆదాయ వనరులను వైవిధ్యం ఉండేలా చేసుకోవడం, ఆర్థిక నిర్వహణను మెరుగుపరుచుకోవడం దీర్ఘకాలికంగా కేవలం ఎక్సైజ్ ఆదాయంపైనే ఆధారపడుతున్న రాష్ట్రాన్ని ఆదుకోగలవు. ప్రస్తుతం తెలంగాణలో మద్యం సరఫరా నిలిపివేయడం అనేది మద్యం వ్యాపారం ఎదుర్కొంటున్న సవాళ్లకు సూక్ష్మరూపం.