కేరళలో పోలింగ్ శాతం తగ్గిందా? కేసీ వేణుగోపాల్ చెబుతున్న కారణాలేంటి?

కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కేరళలో ఈ సారి పోలింగ్ శాతం తగ్గిందంటున్నారు. యూడీఎఫ్ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని ఆరోపిస్తున్నారు.

Update: 2024-04-27 09:52 GMT

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసిన తర్వాత రోజు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ శాతాన్ని తగ్గించే లక్ష్యంతో ఎన్నికల యంత్రాంగాన్ని సీపీఎం హైజాక్ చేసిందని, 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ ఏడాది పోలింగ్ శాతం తగ్గడానికి అదే కారణమని అన్నారు.

2019లో 77.84 శాతం పోలింగ్ శాతం నమోదుకాగా.. ఈ సారి 70.22 శాతం నమోదయ్యింది. రాష్ట్రంలోని మూడు నుంచి ఐదు శాతం పోలింగ్‌ కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం) మొరాయించాయని ఫలితంగా భారీ క్యూలో నిలబడ్డ ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. యూడీఎఫ్ బలంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లోని 90 శాతం ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు.

‘‘ఈవీఎంలు చెడిపోవడంతో ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో లేదు. సిట్టింగ్‌ అరేజ్ మెంట్లు లేవు. లైటింగ్‌ సౌకర్యం కూడా సరిగా లేదు. ఇవన్నీ ఓటర్లను ఇబ్బందిపెట్టాయి’’ అని అన్నారు. 

రాష్ట్రంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను కాంగ్రెస్ విశ్లేషిస్తుందని, ఫలితాల ఆధారంగా అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని వేణుగోపాల్ చెప్పారు.  

Tags:    

Similar News