రెండు కుటుంబాల కథ.. హసన్ లో రక్తికడుతున్న థ్రిల్లర్

కర్ణాటకలో కీలక నియోజకవర్గం హసన్‌లో రెండు రాజకీయ కుటుంబాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Update: 2024-04-15 07:20 GMT

కర్ణాటకలో కీలక నియోజకవర్గం హసన్‌లో రెండు రాజకీయ కుటుంబాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ సారి పొత్తులో భాగంగా బీజేపీ - జేడీఎస్ తరుపున మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎంపీ, దివంగత జి పుట్టస్వామిగౌడ్ మనవడు శ్రేయాస్ ఎం పటేల్‌ను బరిలో నిలిచారు.

మనవడిని ఎంపీగా చూడాలని..

సీనియర్ స్టార్ క్యాంపెయినర్‌ దేవెగౌడ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హాసన్‌ నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టేస్తున్నారు. లోక్‌సభలో తన మనవడు రేవణ్ణను చూడాలని, నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని ఊరూరా తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఇదే సమయంలో రేవణ్ణను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒకప్పటి దేవెగౌడకు ఆశ్రితుడైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

2004 నుంచి జేడీ(ఎస్) పట్టు..

హాసన్‌ నియోజకవర్గం గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. కాంగ్రెస్ తొమ్మిదిసార్లు, కాంగ్రెసేతర పార్టీలు ఎనిమిదిసార్లు విజయం సాధించాయి. జనతా పార్టీ, జేడీ(ఎస్)లు ఏడుసార్లు విజయం సాధించాయి. 2004 నుంచి జేడీ(ఎస్) ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తుంది.

పోటీ ప్రతిష్టాత్మకం..

హసన్ నియోజకవర్గంలో గెలుపును దేవెగౌడ, సిద్ధరామయ్య ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకం. ముఖ్యమంత్రి మాటల దాడి తర్వాత, దేవెగౌడ "సిద్దరామయ్య అహంకారాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ" చేశారు.

2014లో దేవెగౌడ సాధించిన (44.44 శాతం) దాని కంటే 2019లో రేవణ్ణ ఓట్ల శాతం 52.96గా నమోదైంది.

కాంగ్రెస్‌కు సవాల్..

దేవెగౌడ మాజీ ప్రత్యర్థి, మాజీ ఎంపీ, దివంగత జి పుట్టస్వామిగౌడ్ మనవడు శ్రేయాస్ ఎం పటేల్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. రెండు బలమైన కుటుంబాల మధ్య మూడో తరం బరిలో నిలుస్తోంది.

1999లో దేవెగౌడపై పుట్టస్వామిగౌడ్ విజయం సాధించారు. హోలెనర్సీపూర్‌లో రేవణ్ణ తండ్రి హెచ్‌డి రేవణ్ణ చేతిలో శ్రేయాస్ పటేల్ తల్లి ఎస్జీ అనుపమ ఓడిపోయారు. గతేడాది రేవణ్ణపై శ్రేయాస్‌ కేవలం 3 వేల ఓట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు రేవణ్ణ తనయుడు ప్రజ్వల్‌పై పోటీ పడ్డారు.

2019 నుంచి హాసన్ రాజకీయ రూపురేఖల్లో పెద్ద మార్పు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీ(ఎస్) అభ్యర్థిగా రేవణ్ణ పోటీ చేశారు. ఈ సారి బీజేపీ-జేడీ(ఎస్) తరుపున బరిలో నిలిచిన రేవణ్ణ, తన తాత మద్దతుతో ప్రచార బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను విస్త్రతంగా ప్రచారం చేస్తోంది.

“ఈ ఎన్నికలు ప్రజ్వల్‌కు కఠినంగా ఉంటాయి. ఆయనపై అధికార వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక పార్టీ కార్యకర్తలను, నాయకులను తన వెంట తీసుకెళ్లడంలో వైఫల్యమయ్యారు.’’ అని ఆర్కలగూడకు చెందిన సీనియర్ జేడీ(ఎస్) నాయకుడు హెచ్చరించారు.

చాలా కాలంగా దేవెగౌడ కుటుంబానికి మద్దతుగా నిలిచిన హాసన్‌లోని చాలా మంది ఓటర్లు బీజేపీతో జేడీ(ఎస్) చేతులు కలపడం పట్ల సంతోషంగా కనిపించడం లేదు.

నా ఓటు గౌడ వర్గానికే..

‘‘గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడపై బీజేపీ దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు బీజేపీ జేడీ(ఎస్)తో చేతులు కలిపింది. నా ఓటు దేవెగౌడకే.’’ అని హాసన్ జిల్లా ద్యాపాలపురానికి చెందిన చిన్నప్ప గౌడ అన్నారు.

వయసుతో నిమిత్తం లేకుండా దేవెగౌడ ప్రచారం చేస్తున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ఇటు శ్రేయాస్‌ పటేల్‌ తాత కారణంగా రేవణ్ణకు మద్దతు ఇవ్వడానికి ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.

అంతర్గత విభేదాలు..

క్షేత్రస్థాయిలో బీజేపీ, జేడీ(ఎస్‌) నేతలు, కిందిస్థాయి కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. హాసన్ టికెట్ ఆశించిన బీజేపీకి చెందిన ప్రీతమ్ గౌడ్ జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకోవడంపై ఆ పార్టీ అసంతృప్తితో ఉన్నారు. హాసన్‌లో ఆయన మాట్లాడుతూ.. 'బీజేపీ గుర్తుపై పోటీ చేయని అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలకు నేను చెప్పలేను.’’ అని చెప్పారు.

తాను జెడి (ఎస్‌)కి మద్దతు ఇస్తునా, గత ఐదేళ్లలో ఓటర్లను పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యలను రేవణ్ణ పట్టించుకోలేదని ఆలూరుకు చెందిన నారాయణగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆలూరు, సకలేష్‌పూర్ బేలూరులో మానవ-జంతు సంఘర్షణ సమస్యను లేవనెత్తడంలో అతను విఫలమయ్యాడు. ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు.”

అయితే కాంగ్రెస్‌కు చెందిన శ్రేయాస్‌ పటేల్‌పై బీజేపీ-జేడీ(ఎస్‌) అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా మంది వొక్కలిగలు జెడి(ఎస్‌)కి మద్దతిస్తున్నా, పార్టీలో ఒక కుటుంబం హాసన్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండటంపై వారిలో కొందరు అసంతృప్తితో ఉన్నారు.

తాను రెండోసారి పార్లమెంటుకు తిరిగి వస్తాననే విశ్వాసంతో రేవణ్ణ ఫెడరల్‌తో ఇలా అన్నారు: “నా పనితీరు నా సాక్ష్యం. బీజేపీతో పొత్తు అదనపు బొనాంజా.

బిజెపి-జెడి(ఎస్) కూటమికి వ్యతిరేకంగా ఇది కఠినమైన పోరాటమని అంగీకరించిన శ్రేయాస్, కర్నాటకలో ప్రజల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వ హామీ పథకాలపై తాను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు.

ఒకప్పుడు జెడి(ఎస్) సానుభూతిపరుడైన అర్సికెరెకు చెందిన శివనంజప్ప ఇలా అన్నారు: "మహిళల భావోద్వేగాలు, హామీ పథకాలు కాంగ్రెస్‌కు పనిచేస్తాయా లేదా మోడీ హిందుత్వ,జాతీయవాదం గెలుస్తాయో చూడాలి."

Tags:    

Similar News