డబ్బులేదు, అందుకే పోటీ చేయను : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. పోటీ చేసేందుకు అవసరమైనంతా డబ్బు తన వద్ద లేవని పేర్కొన్నారు.

Update: 2024-03-27 15:03 GMT


దేశానికి అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డబ్బుల్లేక ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెబుతే అందుకు కారణం ఎన్నికల ఖర్చుకు  అవసరమయిన డబ్బు తన వద్ద లేవని బుధవారం (మార్చి 27) జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు.

పార్టీ పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినా వెనకడుగువేసేందుకు కారణం ఆమె ఈ రోజు వెల్లడించారు.

 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని సీతారామన్ చెప్పారు. అయితే ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.

“ఎన్నికలలో పోటీ చేయదలచుకోలేదు. నా అయిష్టతను పార్టీ నేతలకు చెప్పాను. వారు అంగీకరించినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.’’ అంటూ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోరాడేందుకు దేశ ఆర్థిక మంత్రి వద్ద కూడా సరిపడా నిధులు ఎందుకు లేవని అడిగినప్పుడు.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు చెందదని అన్నారు. "నా జీతం, నా సంపాదన, నా పొదుపులు నావి తప్ప.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కాదు" అని బదులిచ్చారు.

రాజ్యసభ నుంచి బరిలోకి..

ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే రాబోయే లోక్‌సభ ఎన్నికలలో అధికార BJP ఇప్పటికే ఉన్న అనేక మంది రాజ్యసభ సభ్యులను పోటీకి దింపింది. వీరిలో పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవియా, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.

ప్రచారంలో పాల్గొంటా..

తాను పోటీ చేసిన పోయినా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని నిర్మలా సీతారామన్ చెప్పారు. “నేను చాలా మీడియా ఈవెంట్‌లకు హాజరవుతున్నా. అభ్యర్థులతో కలిసి వెళ్తాను. రేపు నేను రాజీవ్ చంద్రశేఖర్ ప్రచారానికి వెళ్తున్నాం. ’’అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News