యుద్ధానికి విరామం- భారత్, పాక్ అంగీకారం

భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రకటించింది.;

Update: 2025-05-10 13:39 GMT
Modi, Trump and Pak pm
భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రకటించింది. ఇదే విషయాన్ని భారత్, పాక్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ధృవీకరించారు. తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా ముగింపు లభించింది. దీంతో శనివారం సాయంత్రం నుంచి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ కూడా ధృవీకరించారు.

శనివారం సాయంత్రం భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ (Vikram Misri) మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (DGMO) స్థాయిలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. పాకిస్థాన్‌ డీజీఎంఓ భారత డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్రతలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుంది. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంవోలు మళ్లీ చర్చలు జరుపుతారు’’ అని విదేశాంగ మంత్రి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు.
కాల్పుల విరమణను ధృవీకరిస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సైతం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, అచంచలమైన వైఖరిని ఇలాగే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ధైర్యమైన నిర్ణయం
పాకిస్తాన్ దాడుల విషయంలో కేవలం ప్రతిసారీ మౌనంతో సాధ్యపడదని భారత్ ఇటీవల దాడులతో నిరూపించింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. భారత్, తన శక్తిని మౌనంగా చూపించకుండా, స్పష్టంగా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ దురుద్దేశాలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ ప్రతిస్పందనతో పాక్ చివరికి వెనక్కి తగ్గింది. అమెరికా మధ్యవర్తిత్వంతో, కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది.
ఈ నేపథ్యంలో శనివారం (మే 10న) సాయంత్రం ఈ పరిస్థితులకు ముగింపు లభించింది. అయితే శాంతి అంటే బలహీనత మాత్రమే కాదు. అది సమర్థత, స్థిరత్వం, దేశ ప్రజల పట్ల నిబద్ధత గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పవచ్చు. ఈ పరిణామం శాంతిని నిలుపుకోవడంతోపాటు సైనిక శక్తి ఎలా ఉపయోగిస్తుందో భారత్ మరోసారి పాకిస్తాన్ సహా అనేక దేశాలకు చూపించింది. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రజల ప్రాణాల గురించి ఆలోచించిన భారత్ చివరకు శాంతి విధానానికి సమ్మతించింది.అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌- పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు.
ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్‌, పాక్‌ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం భారత్‌ తన రాజీలేని వైఖరిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News