ప్రత్యేక హోదా ఇస్తేనే పీఎంకు ఏపీ పట్ల నిబద్దత ఉన్నట్లు.. జైరాం రమేష్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే.. ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత రుజువవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ అన్నారు.

Update: 2024-02-25 06:33 GMT

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే.. ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత రుజువవుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేష్ అన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌, తిరుపతిలో ఐఐటీని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. "ఈ రెండు సంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనివేనని, అయితే వాటిని ప్రస్తుతం మోదీ ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు.

ఫిబ్ర‌వ‌రి 20, 2014లో రాజ్య‌స‌భ వేదిక‌గా అప్పటి ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ మాటలను జైరాం రమేష్ గుర్తుచేశారు. ‘‘ప్రధాని మన్మోహన్ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తూనే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అయితే అప్పటి బిజెపి నేతలు ఎం. వెంకయ్య నాయుడు లేచి ఏపీ అభివృద్దికి ఐదేళ్ల ప్రత్యేక హోదా సరిపోదని, బిజెపి 10 సంవత్సరాలులు ఇస్తుందన్నారు. ఇప్పడు వారే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జైరాం రమేష్. 

Tags:    

Similar News