జేడీ(ఎస్‌) చీఫ్‌ కర్ణాటకలో పొత్తుపై బీజేపీ నేతలతో ఏమన్నారు?

జనతాదళ్‌ (సెక్యూలర్‌) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో ఎవరిని కలిశారు? బీజేపీతో పొత్తుపై ఏ నిర్ణయం తీసుకున్నారు?

Update: 2024-01-18 10:40 GMT

లోక్‌సభ 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్‌డీఏ సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (సెక్యూలర్‌) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారు.

అమిత్‌ షా ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో కుమారస్వామి కొడుకు, యూత్‌ వింగ్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ నిఖిల్‌ కుమార స్వామి, మాజీ ఎంపీ కుపేంద్ర రెడ్డి కూడా పాల్గొన్నారు.

సుమారు 45 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో కర్ణాటకలో రాజకీయాల గురించి తెలుసుకున్న అమిత్‌ షా, నడ్డా.. సీట్ల సర్దుబాటుపై కుమారస్వామితో చర్చించారు.

ఎన్‌డీఏలో భాగస్వామ్యం, సీట్ల సర్దుబాటు గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడతానని కుమారస్వామి వారికి చెప్పారట.కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి, మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నదే బీజేపీ, జేడీ(ఎస్‌)లక్ష్యంగా కనిపిస్తుంది.

అధికారంలోని వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, కాంగ్రెస్‌ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లనున్నట్లు కుమారస్వామి తెలిపారు.

జేడీ(ఎస్‌) గత సెప్టెంబర్‌లో ఎన్‌డీఏ కూటమిలో చేరింది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 224 స్థానాలకుగాను జేడీ(ఎస్‌)19 స్థానాలతో సరిపెట్టుకోగా, కాంగ్రెస్‌ 135, బీజేపీ 66 స్థానాలను దక్కించుకున్నాయి.

Tags:    

Similar News