RSS చీఫ్ భగవత్ వ్యాఖలపై కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్..

సంతానోత్పత్తి తగ్గుదలపై RSS చీఫ్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. TFR (Total fertility rate) 2.2 నుండి 2కి పడిపోయిందని చెప్పారు.

Update: 2024-12-02 13:03 GMT

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సోమవారం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై ఫైరయ్యారు. దేశంలో జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జంట ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని నాగ్‌పూర్‌లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు. భగవత్ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి స్పందించారు. దేశంలో నిరుద్యోగ సమస్య ప్రబలంగా ఉన్నపుడు

ఉద్యోగం లేని యువకులకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎలా చేస్తారు? భార్య, పిల్లలను ఎలా పోషిస్తారు? అని ప్రశ్నించారు. వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఉందని, ఈ తరుణంలో యువత పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని కోరడం సరైంది కాదని రేణుక అన్నారు.

భగవత్‌ వ్యాఖ్యలపై ఒవైసీ కౌంటర్..

AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భగవత్ వ్యాఖ్యలను విమర్శించారు. RSS చీఫ్ ప్రజలు ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేయాలని కోరుకుంటే..సంస్థలో ఉన్నవారు మొదట మాట ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు.

తగ్గుతున్న TFR

సంతానోత్పత్తి తగ్గుతుండడంపై భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘2021లో విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం.. భారతదేశం TFR (Total fertility rate) 2.2 నుండి 2కి తగ్గింది, అయితే గర్భనిరోధక వ్యాప్తి రేటు 54 శాతం నుండి 67 శాతానికి పెరిగింది. జనాభా తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తోంది. సమాజం మొత్తం సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువకు పడిపోయినప్పుడు అంతరించిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్య కారణంగా ఇప్పటికే చాలా భాషలు, సంస్కృతులు కనుమరుగయ్యాయి. అందువల్ల 2.1 కంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉండేలా జాగ్రత్త పడడం చాలా అవసరం," అని భగవత్ చెప్పారు

Tags:    

Similar News