కేజ్రీవాల్‌కు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు..

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ పొడిగించింది.

Update: 2024-04-15 10:20 GMT

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 23 వరకు పొడిగించింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా గతంలో ఇచ్చిన కస్టడీ గడువు ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచగా, అతని కస్టడీని పొడిగించారు.

దర్యాప్తు కీలక దశలో ఉందని పేర్కొంటూ.. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై స్పందించేందుకు ఈడీకి కోర్టు ఏప్రిల్ 27 వరకు గడువు ఇచ్చింది.

Tags:    

Similar News