తమిళనాడులో డీఎంకేకు జై కొట్టిన కమల్ హాసన్

సినీనటుడు కమల్ హాసన్ డీఎంకేకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రచారం కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

Update: 2024-03-09 09:25 GMT

నటుడు కమల్ హాసన్ DMKకు మద్దతు పలికారు. కమల్ రాజకీయ పార్టీ మక్కల్ నీది మైయం (MNM) శనివారం (మార్చి 9న) అధికార DMK నేతృత్వంలోని కూటమిలో చేరింది. సీఎం స్టాలిన్‌తో కమల్ భేటికి ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఎన్ఎం పార్టీకి కొన్ని సీట్లు దక్కుతాయని వార్తలు వచ్చాయి. అయితే 2025 రాజ్యసభ ఎన్నికలకు ఎంఎన్‌ఎంకు ఒక సీటు కేటాయించినట్లు డీఎంకే ప్రకటించింది. పొత్తకు సంబంధించి డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో కమల్ హాసన్, అధికార పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య ఓ అంగీకారానికి వచ్చారు.

ఒప్పందం కుదిరిన తర్వాత హాసన్ విలేకరులతో మాట్లాడుతూ.. కూటమిలో చేరడం దేశం కోసమే జరిగిందని, పదవి కోసం కాదని వివరణ ఇచ్చుకున్నారు. కూటమికి తన పార్టీ "పూర్తి మద్దతు" ఉంటుందని చెప్పారు. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ, పుదుచ్చేరిలోని ఒకే ఒక్క నియోజకవర్గంలో ఎంఎన్‌ఎం ప్రచారం నిర్వహించనుంది.

Tags:    

Similar News