ఎన్నికల బరిలో మైసూర్ రాజవంశీకుడు.. వ్యూహం మార్చే పనిలో కాంగ్రెస్..

లోక్ సభ ఎన్నికలలో మైసూరు రాజకుటుంబానికి చెందిన వారసుడిని పోటీకి దించబోతోంది కమలం పార్టీ. దీంతో కాంగ్రెస్ కూడా తన వ్యూహన్ని మార్చబోతోంది.

Update: 2024-03-16 15:38 GMT

ఈ సారి జరిగే లోక్ సభ ఎన్నికలలో మైసూరు రాజకుటుంబానికి చెందిన వారసుడిని పోటీకి దించబోతోంది బీజేపీ. మైసూరు-కొడగు నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపి ప్రతాప్ సింహాను పక్కన పెట్టి, యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను ఎంపిక చేసింది. ఈ నియోజకవర్గం నుంచి రాజకుటుంబానికి చెందిన ఒకరు పోటీ చేయడం రెండు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.

వడియార్ కుటుంబం..

శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 2004 లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి చెందిన సిహెచ్ విజయశంకర్ చేతిలో 17,215 ఓట్లతో ఓడిపోయారు. యదువీర్ వడియార్‌కు బిజెపి టిక్కెట్టు ఇస్తుందని ఊహాగానాలు వచ్చినా, సింహా చివరి నిమిషం వరకు తనకు అవకాశం ఉంటుందని ఆశించారు. కానీ అది జరగకపోవడంతో ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.

సింహాను ఎందుకు దూరం పెట్టారు?

గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్‌లో జరిగిన స్మోక్ బాంబ్ ఎపిసోడ్‌లో పాల్గొన్న వారిలో ఒకరికి విజిటర్ పాస్ జారీ చేసినట్లు తెలియడంతో సింహ ప్రతిష్ట మసకబారింది. సింహాకు పార్టీ బలమైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పతో సమస్యలు కూడా ఉన్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరుల ఆశీస్సులు ఉన్నా..

ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులతో..

యదువీర్ వడియార్‌కు టిక్కెట్ దక్కేలా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సహకరించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. యదువీర్ వడియార్ మామగారు జోధ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు. బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడు కూడా.

2019లో ఒక్క సీటు తప్ప మిగతావన్నీ గెలిచిన బీజేపీకి కర్ణాటకలో లోక్‌సభ పోరు చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ప్రతి సీటు గెలవడం సవాలేనని గ్రహించింది.

బీజేపీ సంతోషం..

యదువీర్ ఉనికి మైసూరులోనే కాకుండా కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ కర్ణాటక యూనిట్ భావించింది. వడియార్ కుటుంబానికి చెందిన 24వ రాజు హయాంలో మైసూరు స్వర్ణయుగానికి సాక్ష్యంగా నిలిచిందని బీజేపీ కార్యకర్త ఒకరు ఫెడరల్‌తో అన్నారు. నల్వాడి కృష్ణరాజ వడియార్ మైసూరు ప్రాంతం సమగ్ర అభివృద్ధికి తోడ్పడ్డారు.

పార్టీ తరపున ప్రచారం..

మైసూరు వారసుడు శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ మైసూరు నుంచి నాలుగు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. “బీజేపీ పాత మైసూరు ప్రాంతంలోని ప్రజల సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది” అని మరో బీజేపీ నాయకుడు అన్నారు.

యదువీర్ వడియార్ మైసూరు, కొడగుతో పాటు పాత మైసూరు ప్రాంతంలోని ఇతర నియోజకవర్గాలలో కూడా ప్రచారం చేస్తారని యడ్యూరప్ప అన్నారు.

వ్యూహం మార్చిన సిద్ధరామయ్య..

సింహాను ఓడించడం ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యూహం మార్చుకోవాల్సి వచ్చింది. మైసూరు-కొడగు, చామరాజనగర్, మాండ్యలను తిరిగి గెలవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు, మంత్రులతో మేధోమథనం చేశారు.

మైసూరు-కొడగుకు వొక్కలిగ అభ్యర్థిని కాంగ్రెస్ షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ మనవడు సూరజ్ హెగ్డేతో పాటు మరికొంత అభ్యర్థుల కోసం వెతుకుతోంది. హెగ్డే కర్ణాటక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవాతో పాటు అండమాన్ మరియు నికోబార్ దీవుల ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు.

మాజీ శాసనసభ్యుడు వాసు తనయుడు, బీజేపీ నేత కవిష్‌గౌడ్‌ను వేటాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అహిండ, వొక్కలిగ ఓట్లను ఏకం చేయాలనేది వ్యూహం.

ఇదిలా ఉండగా, బెంగళూరు ప్యాలెస్, మైసూర్ రాజకుటుంబం దావా వేసిన చుట్టుపక్కల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని వేగవంతం చేయాలని సిద్ధరామయ్య అధికారులకు చెప్పారు.

ప్యాలెస్ యుద్ధం..

జనతా ప్రభుత్వ హయాంలో 1996 సిద్ధరామయ్య ఆర్థిక మంత్రిగా ఉన్న ఉన్నపుడు బెంగళూరు-ప్యాలెస్ (స్వాధీనం, బదిలీ) చట్టం 1996 అమలులోకి వచ్చింది. 2015లో సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెరపైకి వచ్చింది. ప్యాలెస్‌ గ్రౌండ్స్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం న్యాయపర చర్యలను వేగవంతం చేస్తుందని శాసనమండలికి హామీ ఇచ్చారు. యదువీర్ వడియార్‌ను లోక్‌సభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది.

Tags:    

Similar News