కేరళలో ఈ సారి కమలం వికసిస్తుంది..ప్రధాని మోదీ

తమ పార్టీ అభ్యర్థుల గెలిపించాలని ప్రధాని మోదీ కేరళలో ప్రచారం చేశారు. ఈ సారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-03-15 12:04 GMT

‘‘కేరళలో అవినీతి, అసమర్థ ప్రభుత్వం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ ప్రభుత్వాల చక్రబంధాన్ని విచ్ఛిన్నం చేస్తేనే జనానికి మేలు జరుగుతుంది’’ అని అన్నారు ప్రధాని మోదీ.

బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అభ్యర్థుల గెలుపు కోసం కేరళలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ ప్రభుత్వాలు రబ్బర్‌ రైతుల పోరాటాలను నిర్లక్ష్యం చేశాయన్నారు. వారి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అదనంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు గణనీయంగా క్షీణించాయని ఆరోపించారు. కేరళలో ఈసారి కమలం వికసించబోతోందన్నారు. గత ఎన్నికల్లో కేరళ ప్రజలు మమ్మల్ని రెండంకెల ఓట్ల శాతం పార్టీగా మార్చారని, ఇప్పుడు ఇక్కడ రెండంకెల సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సభకు ఎన్‌డిఎ లోక్‌సభ అభ్యర్థులు వి మురళీధరన్ (అట్టింగల్), అనిల్ కె ఆంటోని (పతనంతిట్ట), శోభా సురేంద్రన్ (అలప్పుజా), బైజు కలసాల (మావెలిక్కర) ఇతర నేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన పద్మజ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.

Tags:    

Similar News