కళ్ళు తిరిగే లెక్కలు చెబుతున్న మోదీ
ప్రతిపక్షాలు తప్పుడు కథనాలతో దేశ ప్రగతికి అవరోధంగా మారాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గత ఎనిమిది సంవత్సరాల్లో ..
By : The Federal
Update: 2024-07-14 05:39 GMT
దేశంలో గత మూడు, నాలుగు సార్లు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆర్బీఐ తాజాగా రూపొందించి విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందని కొంతమంది తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నారని, ఈ నివేదికతో వారి నోళ్లు మూతపడ్డాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిన్న, పెద్ద పెట్టుబడిదారులు స్వాగతించారని, స్థిరత్వం, వృద్దికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మూడో సారి ప్రభుత్వ ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారని అన్నారు.
ప్రతిపక్షం నకిలీ కథనాలు ఆసరాగా..
రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాల్లో ₹ 29,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులను నిర్మించారని దీనివల్ల వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమైందని చెబుతూనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు ముందున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతికి ఈ పార్టీలన్నీ అవరోధాలుగా మారాయని మోదీ విమర్శల వర్షం కురపించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు నిరుద్యోగం గురించి ప్రజలను భయపెట్టాయని మాటల తూటాలు పేల్చారు. ఇప్పుడు విడుదలైన గణాంకాలు వారందరి కళ్లు తెరిపించాయని అన్నారు.
నకిలీ కథనాలను ప్రచారం చేసేవారు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి శత్రువులు, అలాగే దేశ అభివృద్ధికి శత్రువులు. వారి ప్రతి విధానం యువతకు ద్రోహం చేయడం, ఉపాధిని స్తంభింపజేయడమని వ్యాఖ్యానించారు . ఇప్పుడు వారి అబద్ధాలను ప్రజలు తిరస్కరిస్తున్నందున వారి బండారం బట్టబయలు అవుతుందని మోదీ అన్నారు.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆవశ్యకతపై కూడా ప్రధాని మాట్లాడారు. మహారాష్ట్రకు ఉజ్వలమైన చరిత్ర, సమర్థ వర్తమానం, సుసంపన్నమైన భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, ఆర్థిక రంగాలలో మంచి పట్టు ఉన్నందున వికిసిత్ భారత్‌లో కీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్రం మహారాష్ట్ర అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రకు పోల్ పిచ్
"మహారాష్ట్రను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడం, ముంబైని ప్రపంచ ఫిన్‌టెక్ రాజధానిగా మార్చడం నా లక్ష్యం" అని ప్రధాని అన్నారు. "ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, జీవన నాణ్యతను ఉత్తమంగా మార్చడం మా లక్ష్యం. అందుకే ముంబైకి దగ్గరగా ఉన్న ప్రాంతాల కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని అన్నారాయన. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు.
ముంబై, చుట్టుపక్కల ప్రాంతాలలో రాబోయే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీపంలోని ప్రాంతాలతో నగరానికి కనెక్టివిటీని పెంచుతాయి, ఇది మహిళలకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రతను కూడా కలిగిస్తుందని మోదీ సూచించారు.
మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ శరవేగంగా జరుగుతోందని, పదేళ్ల క్రితం కేవలం 8 కిలోమీటర్ల ఉండే రైలు వ్యవస్థ ఇప్పుడు 80 కిలోమీటర్లకు పెరిగిందని, ఇది త్వరలో 200 కిలోమీటర్లకు పెరుగుతుందని, దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు.
మహారాష్ట్రలో, జాతీయ రహదారుల పొడవు మూడు రెట్లు పెరిగాయని, నగరం ఉత్తర భాగంలో.. తూర్పు-పశ్చిమ కనెక్టర్‌గా పనిచేసే గోరేగావ్-ములుండ్ లింక్ రోడ్డు ప్రకృతిని పరిరక్షించడం మధ్య సమతుల్యతకు చక్కని ఉదాహరణ అని ఆయన అన్నారు. థానేను బోరివలిని కలిపే జంట సొరంగాల నిర్మాణం పూర్తయితే రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని నిమిషాల్లోనే పూర్తి అవుతుందని అన్నారు.
కీలక ప్రాజెక్టులు
కోస్టల్ రోడ్, అటల్ సేతు ఇప్పుడు పూర్తయ్యాయని, అటల్ సేతును నిలిపివేసేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను మోదీ గుర్తు చేసుకున్నారు. "అయితే అది ఎంత ప్రయోజనకరమో ఇప్పుడు అందరూ గ్రహించారు" అని వ్యాఖ్యనించారు. ముంబాయి- నవీ ముంబాయిల మధ్య రెండు గంటల ప్రయాణ సమయాన్ని ఇది 15 నిమిషాలకు తగ్గించింది.
ప్రతిరోజూ సుమారు 20,000 వాహనాలు దీనిని ఉపయోగిస్తాయి. ₹ 20-25 లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలు తమ పనులు చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని మోదీ పేర్కొన్నారు. కొత్త రైల్వేలు ముంబై, మహారాష్ట్రకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అజ్ని-నాగ్‌పూర్‌ల మధ్య అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు..
CSMT, లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ముంబయిలోని సెంట్రల్ రైల్వే రెండు ప్రధాన జంక్షన్లు) వద్ద కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభించబడ్డాయి. ఇక్కడ రైల్వే డిపార్ట్ మెంట్ 24-కోచ్ రైళ్లను నడపడానికి ప్రణాళిక రూపొందించిందని అన్నారు. పాల్ఘర్‌లోని దహనులో ₹76,000 కోట్ల వధవన్ పోర్ట్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీని ద్వారా 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రధాని తెలిపారు.