వన్ నేషన్ వన్ ఎలక్షన్: నివేదికలో కీ పాయింట్స్ ఏంటంటే..

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నివేదికను సమర్పించింది. దీనిలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

Update: 2024-03-14 11:34 GMT

రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' అనే అంశంపై ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది .

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించడం వలన అనిశ్చితి, అస్థిరతకు కారణమవుతున్నాయని నివేదికలో వివరించిందింది. అలాగే సరఫరా గొలుసులకు ఆటంకం కలగడం, వ్యాపార పెట్టుబడులు, ఆర్థిక వృద్దిపై ప్రభావం, ప్రభుత్వ యంత్రాంగానికి అంతరాయ కలగడంతో పాటు పౌరులకు, పౌర సేవలకు ఇబ్బంది కలుగుతోందని నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ అధికారులు, భద్రతా దళాలను తరచుగా ఉపయోగించడం వల్ల వారి విధుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం ఉంటుందంది, మోడల్ ప్రవర్తనా నియమావళి (MCC) తరచుగా విధించడం వల్ల ప్రభుత్వ విధానాలకి ఆటంకం కలుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని తగ్గిస్తుంది. అస్థిరమైన ఎన్నికలు 'ఓటర్లలో అలసట'ను ప్రేరేపిస్తున్నాయి. పౌరులు క్రమంగా ఎన్నికల వ్యవస్థలో సరిగా భాగస్వామ్యం కాలేకపోతున్నారు.
ఏకకాలంలో ఎన్నికలు
లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ మొదటి అంశంగా సిఫార్సు చేసింది. రెండు దశల్లో ఒకేసారి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగాన్ని సవరించాలని నివేదిక పేర్కొంది. కానీ, మొదటి దశగా, రాజ్యాంగ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు.
రెండవ దశలో, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. దీనికి సగానికి తగ్గకుండా రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం, ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడుతున్నాయి. దీనిని మార్చాలని కమిటీ అభిప్రాయపడింది.
1967 నాల్గవ సాధారణ ఎన్నికల వరకు ఏకకాల ఎన్నికలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అయితే, వరుసగా కేంద్ర ప్రభుత్వాలు తమ పదవీకాలం ముగియకముందే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి రాజ్యాంగ నిబంధనలను ఉపయోగించాయి. రాష్ట్రాలలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు రావడం అవి ఏవో కారణాలతో రద్దవడం దేశం చూస్తునే ఉంది. ఇలా దేశం ఏడాది పొడవునా వేర్వేరు సమయాల్లో ఎన్నికలను చూసింది.
ఒకే ఓటర్ల జాబితా, ఎన్నికల ID తయారీ
ఎన్నికల్లో పాల్గొనెందుకు ఒకే ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ ఫొటో గుర్తింపు కార్డులు తయారయ్యేలా రాజ్యాంగాన్ని సవరించాలి. మూడు అంచెల్లో జరిగే ఎన్నికల్లో వీటిని మాత్రమే ఉపయోగించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలి.
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ECలను సంప్రదించి ఒకే ఓటర్ల జాబితా, ఎన్నికల IDని సిద్ధం చేయవచ్చు. ఈ సవరణలకు సగం కంటే తక్కువ కాకుండా రాష్ట్రాల ఆమోదం అవసరం.
రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తే..
అధికారంలో ఉన్న ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం లేదా మరేదైనా కారణాల వల్ల రాష్ట్ర అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసి, ఆ అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, అసెంబ్లీ తాజా పదవీకాలం 5 సంవత్సరాలు కాదు, గడువు ముగిసే వరకు ఉంటుంది. రద్దయిన అసెంబ్లీ మిగిలిన కాలం వరకే ఎన్నికైన అసెంబ్లీ గడువు ఉంటుంది. అలాగే లోక్ సభ పదవీకాలం. దీనికి విరుద్ధంగా, కొన్ని కారణాల వల్ల లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరగాల్సి వస్తే, మధ్యంతర ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసిన కొత్త సభ వెంటనే ముందున్న సెషన్‌లో మిగిలిన పదవీకాలానికి మాత్రమే ఉంటుందని నివేదిక సిఫార్సు చేసింది.
లాజిస్టిక్స్ సవాలు
రాష్ట్ర ECలతో సంప్రదింపులు జరిపి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి అంచనా వేయాలని, మానవశక్తి, పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు, EVMలు/VVPATలు మొదలైన వాటి కోసం చర్యలు తీసుకోవాలని ఈకమిటీ సిఫార్సు చేసింది
Tags:    

Similar News