అయోధ్య రామ్‌లల్లా ప్రతిష్టోత్సవాన్ని ప్రచారానికి వాడుకుంటున్నారా?

హిందు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి పార్టీలు. ఇందుకు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వారికి కలిసొచ్చింది.

Update: 2024-01-07 14:45 GMT

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక జనం వద్దకు వెళ్లేందుకు పార్టీలకు సందర్భంగా దొరికింది. అదే రామమందిర ప్రారంభోత్సవం. హిందూ భక్తులను ఆకర్షించడానికి బెంగళూరులో  అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ రెండూ ఆదివారం ప్రచారాన్ని ప్రారంభించాయి.

బీజేపీ తన ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా రాముడి అక్షింతల (పవిత్ర బియ్యం) పంపిణీని ప్రారంభించింది.

బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, ఆయన కుమారుడు రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర బెంగళూరులోని హిందువుల తలుపుల తట్టడం ప్రారంభించారు. జనవరి 22న ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలంటూ అయోధ్య రామమందిరం విశేషాలతో కూడిన ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు.

శతాబ్దాల తర్వాత అయోధ్యలోని తన నివాసానికి ‘రామ్‌లల్లా’ వస్తున్నాడు. ఈ సందర్భానికి గుర్తుగా తమ ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలని బిజెపి నాయకులు హిందూ కుటుంబాలను అభ్యర్థిస్తున్నారు.

హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. బాలరాముడి (రామ్‌లల్లా) విగ్రహ ప్రతిష్ఠ రోజును రామభక్తులంతా తమ ఇంట్లో లేదా సమీపంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరతారని చెప్పారు.

జనవరి 22న ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

‘‘జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు తమ ఆధీనంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని హిందూ మత దేవాదాయ శాఖకు చెప్పాను’’ అని ముజ్రాయ్‌ మంత్రి (హిందూ మత దానం) రామలింగారెడ్డి విలేకరులతో అన్నారు.

Tags:    

Similar News