అమిత్ షాతో రాజ్ ఠాక్రే భేటీ.. పొత్తు కోసమేనా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేల మధ్య జరిగిన భేటీ బాగా జరిగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Update: 2024-03-20 13:38 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేల మధ్య జరిగిన భేటీ బాగా జరిగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

మంగళవారం ఢిల్లీలో ఠాక్రే, షా సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఠాక్రేతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఆసక్తి చూపుతుందనడానికి వీరి సమావేశమే నిదర్శనం.

ఇరువురు నేతల భేటీకి సంబంధించిన ప్రశ్నలకు ఫడ్నవీస్ స్పందిస్తూ.. ‘రాజ్ ఠాక్రే అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. వెంటనే దానిపై వ్యాఖ్యానించడం సరికాదు. రాబోయే కొద్ది రోజుల్లో మేము మీకు వివరంగా తెలియజేస్తాము." అని ఫఢ్నవీస్ తెలిపారు.

రాజ్ ఠాక్రే సూచన మేరకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత బాలా నంద్‌గావ్కర్ తెలిపారు. రాజ్ ఠాక్రే శివసేనను విడిచిపెట్టి, 2006లో MNS ప్రారంభించారు. కూటమి ఖాయమైతే ముంబై నుంచి పోటీ చేసేందుకు ఎంఎన్‌ఎస్‌కు ఒక సీటు ఇచ్చే అవకాశం ఉంది.

కీలక బారామతి, మాధా లోక్‌సభ స్థానాలను గెలిస్తే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడానికి దోహదపడుతుందని ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. ఎన్‌సిపికి చెందిన సుప్రియా సూలే (శరద్‌చంద్ర పవార్)పై ఎన్‌సిపి అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పేరు ఖరారవుతుందని భావిస్తున్నారు. అయితే, బీజేపీ మిత్రపక్షాలకు చెందిన కొందరు స్థానిక నేతలు పవార్ అభ్యర్థిత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News