మొదటిసారి ఓటర్లకు 'సంచారి' అవగాహన కార్యక్రమం

సంచార జాతులు, అట్టడుగు వర్గాల వారిని రాజకీయ పార్టీలు రెండవ శ్రేణి ఓటర్లుగానే పరిగణించడం వలన వారిలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

Update: 2024-04-28 13:53 GMT

భవిష్య భారత్ పేరిట వాలంటరీ సంస్థ 'సంచారి' తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో మొదటిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఓటు వేయడం వెనక ఉన్న ప్రాధాన్యతను వారికి వివరించారు. సంచార జాతులు, అట్టడుగు వర్గాల వారిని రాజకీయ పార్టీలు రెండవ శ్రేణి ఓటర్లుగానే పరిగణించడం వలన వారిలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో సంచారి సంస్థ, సామాజిక సేవా సంస్థలు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాయి. ఆ కమ్యూనిటీల ప్రజలను ఓటు హక్కు నమోదు చేసుకునేలా కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో 27 వేల మంది కొత్తగా ఓటర్ల జాబితాలోకి చేర్చబడ్డారు.



అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మత్స్యకార యానాది సామాజికవర్గాలలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 ఏళ్ల యువతకి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని.. ఏపీ మత్స్యశాఖ, యానాది సంఘాలను కోరారు. సంచారి వ్యవస్థాపక అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఈ కాలనీలను సందర్శించనున్నారు. ఒకరోజు సంచార జాతులను, ఒకరోజు యానాది కమ్యూనిటీల యువ ఓటర్లను.. మధ్యానం సెషన్ లో మహిళా ఓటర్లను, సాయంత్రం సెషన్ లో పురుషలను కలిసి ఓటుహక్కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్ ఏప్రిల్ 28 న మొదలై మే 10 వరకు కొనసాగనుంది.

ఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మత్స్యకార సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరులోని ఫిషర్ మెన్ కాలేజ్ బాలుర హాస్టల్ లో మొదటి సారి ఓటర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ మత్స్యకార అభివృద్ధి మండలి సభ్యులు, సంచారి అధ్యక్షులు డా.శ్రీనివాసులు IAS (Rtd) హాజరయ్యారు.

 


Tags:    

Similar News