ఇండియాలో ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడకూడదా? : నితాషా కౌల్

కర్ణాటకలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు విమానాశ్రయంలో నితాషా కౌల్ దిగారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.

Update: 2024-02-26 09:40 GMT

నితాషా కౌల్. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంతతికి చెందిన ఒక ప్రొఫెసర్. కర్ణాటకలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు కౌల్‌ను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో 'రాజ్యాంగం - జాతీయ ఐక్యత సదస్సు -2024' కు కర్ణాటక ప్రభుత్వం కౌల్‌ను స్పీకర్‌గా ఆహ్వానించింది. ఆమె రాకను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో X వేదికగా తన బాధను పంచుకున్నారు. "మేము ఏం చేయలేం. ఢిల్లీ నుంచి ఆదేశాలు" అని తప్ప ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు ఎటువంటి కారణం చెప్పలేదని కౌల్ పేర్కొన్నారు

"ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడినందుకు భారతదేశంలోకి నా ప్రవేశాన్ని అడ్డుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం (కాంగ్రెస్-పాలిత రాష్ట్రం) గౌరవప్రద ప్రతినిధిగా నన్ను సమావేశానికి ఆహ్వానించింది. కానీ కేంద్రం నా ప్రవేశాన్ని నిరాకరించింది. నా పత్రాలన్నీ చెల్లుబాటు అయ్యేవి అని ట్వీట్ చేసింది.


తాను గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించినందున భారత్‌లోకి ప్రవేశం నిరాకరించినట్లు అధికారులు అనధికారికంగా సూచించారని కౌల్ ఎక్స్‌లో పేర్కొంది. కాగా కౌల్‌ను బిజెపి "పాకిస్తానీ సానుభూతిపరురాలు" అని ముద్ర వేసింది. ఆమె రెండు రచనల శీర్షికలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

"మా భద్రతా ఏజెన్సీలకు ధన్యవాదాలు. భారతదేశ వ్యతిరేక మూలకం ఇండియాలోకి అనుమానాస్పదంగా ప్రవేశించినా.. విమానాశ్రయంలో అడ్డుకున్నారు" అని బిజెపి పేర్కొంది.

"నా ప్రయాణాన్ని కర్ణాటక వాళ్లు ఏర్పాటు చేశారు. నా వద్ద అధికారిక లేఖ ఉంది. నాకు నోటీసు లేదా సమాచారం రాలేదు. బెంగళూరు విమానాశ్రయంలో తనకు ఎదురైన కష్టాలను ఇలా వివరించింది. "నేను లండన్ నుంచి బెంగుళూరుకు విమానంలో 12 గంటలు గడిపాను. ఇమ్మిగ్రేషన్‌లో చాలా గంటలు ఉన్నాను. ఆపై హోల్డింగ్ సెల్‌లో 24 గంటలు cctv పర్యవేక్షణలో ఉంచారు.

మొదటిసారి కాదు

తనకు ఇలాంటి అవమానం జరగడం ఇదే మొదటిసారి కాదని కూడా చెప్పారు. "నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీలో ఏర్పాటు చేసిన చర్చకు కూడా ఆహ్వనించలేదని పేర్కొన్నారు. కౌల్ ఒక పోస్ట్‌లో తన మూలాలు కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్నాయని, అయితే తాను ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించానని పేర్కొన్నారు. విద్యావేత్తలు, పాత్రికేయులు, కార్యకర్తలు, రచయితలపై నిషేధం విధించడం దయనీయమని పేర్కొన్నారు.


ప్రజాస్వామ్య పరిరక్షణలో తన పనిని కొనసాగిస్తానని నొక్కి చెబుతూ.. కౌల్ ఒక పోస్ట్‌లో "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి కలం, పదం ద్వారా ముప్పు వాటిల్లుతుంది" అని అన్నారు. “రాజ్యాంగంపై జరిగే సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన ప్రొఫెసర్‌ని కేంద్రం అనుమతించకపోవడం ఎలా? అని ఆమె పోస్ట్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి, విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News