అవమానాలు భరిస్తూ ఇంకా ఎన్నాళ్లు ఆ బిజెపిలో... గడ్కరీకి ఉద్ధావ్ సలహా

బిజెపి మొదటి లిస్టులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరు లేదు. మహారాష్ట్రలో సీట్ షేరింగ చర్చల వల్ల ఆయన పేరు లేదు, ఇది అవమానం అంటున్నారు ఉద్ధవ్ ఠాక్రే...

Update: 2024-03-13 06:51 GMT

 పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోతే బీజేపీని వీడాలని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. మహారాష్ట్రలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పుసాద్‌లో జరిగిన ర్యాలీలో ఠాక్రే మాట్లాడారు. అవినీతి ఆరోపణలున్న మాజీ కాంగ్రెస్ నేత కృపాశంకర్ సింగ్‌ పేరు బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాలో ఉండడం, గడ్కరీ పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఠాక్రే అన్నారు.

“నేను ఈ విషయాన్ని గడ్కరీకి రెండు రోజుల క్రితమే చెప్పాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురైతే, బీజేపీని వీడి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో చేరండి. మేము మీ విజయం కోసం కృషి చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం. అధికారాలతో కూడిన పదవి ఇస్తాం’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

ప్రతిపక్ష MVAలో శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని NCP (SP) కాంగ్రెస్ ఉన్నాయి.

గడ్కరీకి ఠాక్రే ఇచ్చిన ఆఫర్‌పై బీజేపీ నేత ఫడ్నవీస్ హేళనగా మాట్లాడారు. వీధిలో నిలుచున్న ఓ వ్యక్తి మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిని చేస్తాననడం ఎలా ఉంటుందో, ఠాక్రే తీరు కూడా అలానే ఉందన్నారు.

బిజెపి దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాల చర్చలు పూర్తి కానందున మొదటి జాబితాలో మహారాష్ట్ర నుంచి గడ్కరీ పేరు లేవని ఫడ్నవీస్ చెప్పారు.

Tags:    

Similar News