ఆ పోలీస్ ఆఫీసర్ దురుసుగా ప్రవర్తించాడు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఓ పోలీసు ఉన్నతాధికారిని తన భద్రతా బృందం నుంచి తప్పించాలని కేజ్రీవాల్ కోర్టులో పిటీషన్ వేశారు.

Update: 2024-03-23 08:33 GMT

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రౌజ్ అవెన్యూ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఢిల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె సింగ్‌ను ఇప్పుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని అందులోపేర్కొన్నారు. తన భద్రతా బృందం నుంచి ఆయన్ను తొలగించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టులోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని భద్రపరచాలని కోర్టు సిబ్బందిని, పోలీసులను ఆదేశించారు.

సిసోడియాతో కూడా..

కాగా ఇదే పోలీస్ ఉన్నతాధికారి ఎకె సింగ్‌ గతంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై పట్ల దురుసుగా ప్రవర్తించాడు. గత ఏడాది ఇదే కోర్టు ఆవరణలో సిసోడియాను విలేకరులు ప్రశ్నిస్తుండగా.. మెడ పట్టుకుని లాగినట్టు వీడియోలో రికార్డు అయ్యింది. అయితే అలాగేం జరగలేదని ఆయన భద్రత కూడా తమకు ముఖ్యమని ఢిల్లీ పోలీసులు తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.

కస్టడీకి కేజ్రీవాల్..

లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. అయితే ఏడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.  

Tags:    

Similar News