ఈ మార్పుకు కారణం ధోనినే: శివమ్ దూబే

టీం ఇండియా నయా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మార్పుకు కారణం మాజీ కెప్టెన్ ధోనినే అని చెప్పుకొచ్చాడు.

Update: 2024-01-12 10:13 GMT
శివమ్ దూబే

ప్రస్తుతం నా బ్యాటింగ్, బౌలింగ్ మెరుగుపడిందంటే దానికి కారణం ఎంఎస్ ధోనినే అని శివమ్ దూబే అన్నారు. ‘నేను బ్యాటింగ్ కు వచ్చినప్పుడు మహీ భాయ్ నాకు ఇచ్చిన సలహాలను పాటించడానికి ప్రయత్నిస్తున్న, అందుకే ఈ మార్పుకు కారణమైంది’ అని దూబే చెప్పారు.

‘నేను వీలైనప్పుడు మహీ భాయ్ తో మాట్లాడుతూ ఉంటాను. మైదానంలో పరిస్థితులను ఎలా ఆకలింపు చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలో తగిన సూచనలు భాయ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఓ రెండు మూడు చిట్కాలు సైతం చెప్పారు’ అని దూబె వివరించారు. క్రీజ్ లో ఎలా కదలాలో కూడా మాజీ కెప్టెన్ సూచించడని, దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఈ ముంబై ఆల్ రౌండర్ చెప్పుకొచ్చాడు.

‘రోహిత్, ఎంఎస్ ధోని ఇద్దరు కూడా నా బ్యాటింగ్ విషయంలో ఒకేలా ఆలోచించారు. నన్ను ఎప్పుడు ముందు వరుసలో పంపే ప్రయత్నం చేసి ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండే అవకాశం ఇచ్చారు, కానీ దురదృష్టవశాత్తూ మొదట వాటిని ఉపయోగించుకోలేకపోయాను’ అని దూబే అన్నాడు.

జట్టులో చోటు దక్కకపోవడంతో నా బలహీనతలపై దృష్టిపెట్టి సాధన చేసినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు సరైన ప్రదేశంలో బంతులు వేయడం, వాటికి వేగం, వైవిధ్యాన్ని జత చేయడం ఈ మధ్య విరామంలో నేర్చుకున్నానిని దూబే చెప్పాడు.

దూబే చైనాలో జరిగిన ఆసియాకప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత స్వదేశంలో ఆసీస్ తో జరిగిన టీ20 సిరీస్ చోటు దక్కించుకున్నా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపిక కాలేదు.

కానీ స్వదేశంలో జరిగిన అప్గాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ కు ఎంపిక అయ్యాడు. తొలి మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించారు. బౌలింగ్ (1/9), బ్యాటింగ్ లో 40 బంతుల్లో 60 పరుగులు సాధించి, మ్యాన్ ఆఫ్ దీ మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. అమెరికా- వెస్టీండీస్ సంయుక్తంగా అతిథ్యమిచ్చే ఐసీసీ టీం జట్టుకు సన్నాహకంగా ప్రస్తుత సిరీస్ ను భారతజట్టు పరిశీలిస్తోంది. ఇందులో బాగా ఆడిన వారికి జట్టులో చోటుదక్కే అవకాశాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. 

Tags:    

Similar News