తమిళనాడు బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవే..

తమిళనాడు ప్రభుత్వం సోమవారం 2024-25 సంవత్సరానికిగాను శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. సామాజిక న్యాయం, మహిళా సంక్షేమానికి పెద్దపీఠ వేసింది.

Update: 2024-02-19 08:22 GMT

తమిళనాడు ప్రభుత్వం సోమవారం 2024-25 సంవత్సరానికిగాను శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. "7 గ్రాండ్ తమిళ్ డ్రీమ్"పై కసరత్తు చేసిన స్టాలిన్ ప్రభుత్వం.. సామాజిక న్యాయం, మహిళా సంక్షేమానికి పెద్దపీఠ వేసింది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్‌లోని అంశాలను చదివి వినిపించారు. సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల సంక్షేమం, తమిళ యువతను ప్రపంచ సాధకులుగా మార్చడం, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మహిళా సంక్షేమం, సమానత్వం. తమిళ భాష, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారు.

2030 నాటికి 8 లక్షల గృహాలు

మాజీ ముఖ్యమంత్రి దివంగత M కరుణానిధి పేరు మీద గృహనిర్మాణ (కళైగ్నరిన్ కనవు ఇల్లమ్) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2030 నాటికి 'గుడిసెలు లేని' గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల కాంక్రీట్ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. వీటితో పాటు నగర కార్పొరేషన్‌లకు రోడ్లు, పౌర సౌకర్యాల కోసం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదరిక నిర్మూలనలో రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించిందని తెన్నరసు వివరించారు. తమిళనాడులో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కేవలం 2.2 శాతం మాత్రమే ఉన్నారని నీతి ఆయోగ్ పేర్కొన్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

Tags:    

Similar News