హైదరాబాద్ లో 11న మంచి సినిమాల ‘ఫిల్మ్ ఫెస్టివల్’
కలకత్తా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అందిస్తున్న 9 మంచి సినిమాలు
మంచి సినిమాలను ప్రోత్సహించే కోల్ కతా కు చెందిన ‘ముందడుగు’, హైదరాబాద్ ‘మంచిసినిమా’, ఫెడరేషన్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ సదరన్ రీజియన్ లు హైదరాబాద్ లో వచ్చే ఆదివారం నాడు ఒక చిన్న ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ట్రావెలింగ్ కెపీఎప్ ఎఫ్ ( కోల్ కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్) అనే సంస్థ కొన్ని ఉత్తమ చిత్రాలను తెలుగు వాళ్లకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనితో పాటు రేపు 'హిరోషిమా నాగసాకి అణు విధ్వంసం సందర్భంగా ఈ అణు ప్రళయం నుంచి నేర్చుకోవలసిన చారిత్రక గుణపాఠాల మీద కొన్ని స్కూళ్లలో స్లయిడ్ షో ప్రదర్శనలుకూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు, విశాఖ పట్నం, విజయవాడ, మంగళగిరి, ఖమ్మంలలో ఈ కార్య్రక్రమాలు ముగిశాయి. ఈ రోజు గుంటూరు లో నిర్వహిస్తున్నారు. 8-08-2024 (గురువారం) గుంటూరులోఉ.10.00 - గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ (గుజ్జనగుళ్ళ రోడ్); మ. 2.00 - ఎం.వి.ఎస్. కోటేశ్వరరావు మెమోరియల్ పబ్లిక్ స్కూలు, సుందరయ్య నగర్, అడవితక్కెళ్ళపాడు లో స్లయిడ్ షో ఉంటుంది.
కర్నూలు, హైదరాబాద్ లలో ఈ కార్యక్రమాలు జరగాల్సి ఉంది. 09-08-2024న కర్నూలు జిల్లాలోఉ. 9.30 - లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (శుక్రవారం - నాగసాకి దినం పాటిస్తున్నారు. 10-08-2024 న (శనివారం) హైదరాబాదులోఉ. 10.00 - ప్రగతి విద్యానికేతన్, ప్రగతినగర్ లో, మ. 2.30 - గురుకుల బాలికల పాఠశాల, బోరబండలో స్లయిడ్ షో ఉంటుంది.
ఇక సినిమాలకు సంబంధించి హైదరాబాద్ లో పదకొండవ తేదీ మధ్యాహ్నం ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. కోల్కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ఎంపిక చేసిన ఉత్తమ లఘు చిత్రాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. కొన్ని సినిమాల దర్శకులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ సినిమాలు ఇతరత్రా చూసే అవకాశం ఇప్పట్లో ఐతే లేదు. అందువల్ల చలన చిత్ర అభిమానులకు ఇదొక మంచి అవకాశం.
ఎంపిక చేసిన సినిమాలు:
Chai Darbari directed by Prateek Shekhar
ప్రతీక్ శేఖర్ దర్శకత్వం వహించిన *చాయ్ దర్బారి
Footprints directed by Tathagata Ghosh
తథాగత ఘోష్ దర్శకత్వం వహించిన *పాదముద్రలు
Mahasatta directed by Vikram Bolegave
విక్రమ్ బోలెగావే దర్శకత్వం వహించిన *మహాసత్తా
Missing Since 6.12.1956 directed by Anand పాండే
ఆనంద్ పాండే దర్శకత్వం వహించిన *మిస్సింగ్ సీన్స్ 6.12.1956
Neon directed by Sakshi Gulati
సాక్షి గులాటి దర్శకత్వం వహించిన *నియాన్
Prison Diaries directed by Uma Chakravarti
ఉమా చక్రవర్తి దర్శకత్వం వహించిన జైలు డైరీస్
Two Way Street directed by Asmit Pathare
అస్మిత్ పఠారే దర్శకత్వం వహించిన టూ వే స్ట్రీట్
The Unknown Kerala Stories directed by Sanu Kummil
సాను కుమ్మిల్ దర్శకత్వం వహించిన *ది అన్నోన్ కేరళ స్టోరీస్
Viral directed by Shreyas Dasharathe and Jamshed Irani
శ్రేయాస్ దశరథే & జంషెడ్ ఇరానీ దర్శకత్వం వహించిన *వైరల్