ఆ రోజు హిందువులకు రెండు గంటలు సెలవు: మారిషస్ మంత్రివర్గ నిర్ణయం

భారతదేశంలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ సందర్భంగా మారిషస్ గవర్నమెంట్ అక్కడి హిందూ ఉద్యోగులకు 2 గంటల పాటు సెలవు ప్రకటించింది.

Update: 2024-01-13 09:00 GMT

భారతదేశంలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. వైభవోపేతంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టోత్సవం జరగబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మారిషస్ గవర్నమెంట్ అక్కడి హిందూ ఉద్యోగులకు 2 గంటల పాటు సెలవు ప్రకటించింది.

ఆలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు.

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హిందూమతానికి చెందిన ఉద్యోగులు, అధికారులకు జనవరి 22వ తేదీన రెండు గంటల ప్రత్యేక సెలవు ఇచ్చేందుకు మారిషస్ మంత్రివర్గం అంగీకరించింది. ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

మారిషస్‌లో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 48.5 శాతం మంది ఉన్నారు. ఆఫ్రికాలో హిందూమతాన్ని ఆచరించే ఏకైక దేశం మారిషస్.

భారతీయులు ఫ్రెంచ్‌కు ఒప్పంద కార్మికులుగా వచ్చి స్థిరపడిపోయారు. ఆ తర్వాత వీరు మారిషస్, హిందూ మహాసముద్రం పొరుగు ద్వీపాలకు వలస వెళ్లడం వల్ల హిందూమతం మారిషస్‌కు విస్తరించింది. ఉపాధి కోసం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారు ఉన్నారు. 

Tags:    

Similar News